ట్రంప్ తల పొగరు దించుదాం.. ఒక్కటవుతున్న భారత్,రష్యా, చైనా దేశాలు..మూడు దేశాలు ఏకమైతే సామిరంగా..

US Trade War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దాడితో ప్రపంచ వాణిజ్య వేదిక మీద కల్లోలం రేపుతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతూ భారత్‌ సహా పలు దేశాలపై భారీ సుంకాలను విధిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత దిగుమతులపై సుంకాన్ని నేరుగా 50 శాతాకి పెంచే ఉత్తర్వు జారీ చేశారు. దీనిపై ట్రంప్ పలు కుంటి సాకులు చెబుతున్నారు. ఇది కేవలం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదని జాతీయ భద్రత, విదేశాంగ విధాన అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

భారతదేశం రష్యన్ చమురు దిగుమతులను కొనసాగించడం వల్ల అది అమెరికా భద్రతకు ముప్పుగా మారిందని చెబుతున్నారు. అయితే వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి కీలక రంగాల్లో అమెరికా కంపెనీల ఎంట్రీకి భారత్ అడ్డుకట్ట వేస్తోంది.ఈ కారణంతోనే ట్రంప్ భారత్ మీద కక్ష కట్టారనేది వాస్తవం. దేశ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని..మీ పాడి ఉత్పత్తులకు భారతదేశంలో ఎంట్రీ ఉండదని భారత ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధించారు

ఈ పరిస్థితుల మధ్య ప్రపంచ వ్యాప్తంగా కొత్త భౌగోళిక-రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ కి వ్యతిరేకంగా మూడు అగ్రదేశాలైన రష్యా, చైనా, భారత్ ఏకమవుతున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించి ..ఆ దేశ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో భేటీ అయ్యారు. ఈ పర్యటన అధికారికంగా ఇంధన, రక్షణ సహకారం గురించి సాగిందని తెలిపినా.. ట్రంప్ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడమే అసలు అజెండా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక త్వరలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ కూడా మాస్కో పర్యటనకు సిద్ధమవుతున్నారు.

Trump India trade talks Trump cancels India negotiations US-India tariff dispute Donald Trump import tariffs Trump blocks India trade deal India-US trade tensions Trump trade war India Trump India economic relations US tariffs on Indian goods India US import tax issue no trade deal India Trump Trump halts trade discussions Trump India foreign policy BRICS trade standoff global tariff conflicts - US Trade War

ఇక ఈ మధ్య గల్వాన్ లోయ ఘటనను మరిచి ప్రధాని మోదీ కూడా ఏడేళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్ళనున్నారు. గల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్ల దాడులు, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల అమరత్వం..ఈ అంశాలన్నీ పక్కనబెట్టి ట్రంప్ కు ధీటైన సమాధానం ఇవ్వడానికి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు ఆది నుంచి బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మోదీ చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పుడు మోదీ-షీ జిన్‌పింగ్ భేటీ, రష్యా-చైనా-భారత్ సన్నిహిత సహకారానికి మార్గం సుగమం చేయవచ్చని భావిస్తున్నారు.

ఇక బ్రెజిల్ కూడా ఈ వ్యూహంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చింది. అమెరికా టారిఫ్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా..ట్రంప్‌కు ఫోన్ చేయను, కానీ మోదీ, జిన్‌పింగ్‌లతో మాట్లాడుతానని తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ అంశాన్ని తీసుకెళ్తానని ప్రకటించారు. ఇది BRICS కూటమి మళ్లీ శక్తివంతమవుతుందనే సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. రష్యా-భారత్-చైనా త్రయం మరింత క్రియాశీలంగా మారాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ట్రంప్ సుంకాల దాడులు, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు, రష్యన్ చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల హెచ్చరికలతో మూడు దేశాలు ఏకమై ట్రంప్ పొగరు దించాలని సూచించారు.

క్లుప్తంగా చెప్పాలంటే. ట్రంప్ 50 శాతం టారిఫ్ నిర్ణయం కేవలం వాణిజ్య ఒత్తిడే కాదు, భౌగోళిక-రాజకీయ బంధాలను గట్టిగా మార్చే సంఘటనగా మారింది. అమెరికాను ఎదుర్కునేందుకు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలు జట్టుకట్టాల్సిన అవసరం ఏర్పడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+