ఇప్పుడు ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. అమెరికా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం చూపేలా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో, రష్యాను ఆర్థికంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతో అమెరికా గట్టిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భారత్ లేదా చైనా లాంటి దేశాలు రష్యాతో బిజినెస్ చేస్తుంటే, అక్కడి నుంచి వచ్చే సరుకులపై 500% దిగుమతి ట్యాక్స్ వేయాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇది అమలైతే, గ్లోబల్ ట్రేడ్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

అమెరికా ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైన బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రకారం, రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రత్యేకంగా భారత్, చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల పై 500% దిగుమతి ట్యాక్స్ వేయాలని ఆలోచిస్తుంది.
అసల ఎందుకు ఈ బిల్లు(Sanctioning Russia Act) పెడతుందంటే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత కూడా, భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నాయి. రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు, అలాగే ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉండని దేశాలను ఒత్తిడి చేయడమే లక్ష్యం. భారత్, చైనా ప్రధానంగా ఈ బిల్లులో లక్ష్యంగా ఉన్న దేశాలు. ఈ రెండు దేశాలు కలిపి రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు 70% కొనుగోలు చేస్తున్నారు.
అమెరికా సెనేట్ సభ్యుడు లిండ్సే గ్రాహామ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో, ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడికి టారిఫ్ అమలుపై మినహాయింపు (waiver) ఇచ్చే అధికారం కూడా ఈ బిల్లులో ఇవ్వబడింది. ఈ చర్యల ప్రధాన లక్ష్యం రష్యా యొక్క యుద్ధ సామర్థ్యాన్ని ఆర్థికంగా బలహీనపరచడం, మరియు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి చర్చలు జరిగేలా ఒత్తిడి తీసుకురావడం. ఈ బిల్లు ప్రస్తుతం ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో 84 మంది సభ్యులు దీనికి మద్దతు తెలిపారు. వచ్చే ఆగస్టు నెలలో ఈ బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టే అవకాశముంది.
ఏ ఉత్పత్తులపై ప్రభావం?
ఈ బిల్లు అమలైతే, భారత్, చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాలు, వస్త్రాలు, ఆటోమొబైల్ భాగాలు, ఐటీ సేవలు వంటి అనేక ఉత్పత్తులపై 500% దిగుమతి టాక్స్ విధించ బడే అవకాశం ఉంది.
భారత దేశం ప్రస్తుతం అమెరికాతో వ్యాపార ఒప్పందాల (ట్రేడ్ డీల్) చర్చల్లో ఉంది. అయితే "Sanctioning Russia Act" బిల్లు అమలయ్యే పరిస్థితి వస్తే, ఆ ఒప్పందం ద్వారా అందాల్సిన ప్రయోజనాలు తగ్గిపోవచ్చు, లేదా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, చైనా మరియు భారత్ రష్యా చమురుపై భారీగా ఆధారపడుతున్నాయి. ఈ రెండు దేశాలు కలిపి రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు 70% వరకు కొనుగోలు చేస్తున్నాయి. ఒక్క భారత్‌నే తీసుకుంటే, 2024లో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారెల్స్ చమురు రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఇది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్‌ల నుంచి కలిపి దిగుమతులు కంటే అధికం. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదిస్తున్న బిల్లు అమలైతే, భారత్‌కు నష్టాలు కలగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఈ బిల్లును "ఆర్థిక బంకర్ బస్టర్"గా భావిస్తోంది. కానీ, అంతర్జాతీయంగా దీని వల్ల ట్రేడ్ వార్, డిప్లొమాటిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications