Google: ప్రస్తుతం ప్రపంచ వ్యాపాతంగా ఉన్న టెక్ కంపెనీలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగుల విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి.

గూగుల్ ప్రమోషన్స్..
ఖర్చులను తగ్గించుకోవటంలో భాగంగా యూఎస్ టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది తక్కువ మందిని సీనియర్ స్థానాలకు ప్రమోట్ చేయనున్నట్లు ఇప్పటికే ఉద్యోగులకు వెల్లడించినట్లు సమాచారం.

తక్కువ ప్రమోషన్లు..
ప్రమోషన్ ప్రక్రియ మేనేజర్ నేతృత్వంలో ఉండనుంది. గత సంవత్సరం ప్రక్రియకు సమానంగా ఉంటుంది. నియామకాలు నెమ్మదిగా ఉన్నందున.. L6, అంతకంటే ఎక్కువ స్థాయిలో తక్కువ ప్రమోషన్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ GRADని అమలు చేస్తున్నందున ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. కంపెనీ వృద్ధికి అనుగుణంలో సీనియర్, నాయకత్వ పాత్రల్లో సరిపడా సంఖ్యలో గూగ్లర్లను ఉండేలా చూడటమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈమెయిల్ లో స్పష్టం చేసినట్లు సమాచారం.

అంతర్గత సర్వే..
కంపెనీలో మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగుల పనితీరు, ఉత్పత్తులను సమర్థవంతంగా తీసుకురాగల సామర్థ్యం గురించి ఆందోళనల నేపథ్యంలో ప్రమోషన్ల విధానంలో మార్పులకు కంపెనీ దిగిందని తెలుస్తోంది. అయితే కంపెనీ గత ఏడాది దీనికి సంబంధించి ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పదోన్నతి పొందాలనుకునే టెక్నికల్ ఉద్యోగులు మార్చి 6-8 మధ్య తమను తాము స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో పేర్కొంది.

జనవరిలో తొలగింపులు..
ఆర్థిక సంక్షోభం కారణంగా టెక్ దిగ్గజం భారీగా ఆదాయ కోతలను ఎదుర్కొంది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు.
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన ఒరాకిల్.. లేఆప్స్ తరువాత స్టాక్ మార్కెట్లో పరుగులు పెట్టిన షేర్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications