Google Layoffs: నెలలు గడుస్తున్నా అమెరికాలో టెక్ కంపెనీల ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు కనిపించటం లేదు. ఉద్యోగుల తొలగింపుల విషయంలో తమ కఠినత్వాన్ని కంపెనీలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో అనేక నెలల గ్యాప్ తర్వాత గూగుల్ మళ్లీ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. మ్యాపింగ్ యాప్ Wazeని తన సొంత మ్యాప్ ఉత్పత్తుల యూనిట్ లో ఏకీకృతం చేస్తున్న క్రమంలో తాజా కోతలు మెుదలయ్యాయి. Waze యాడ్స్ మానిటైజేషన్‌లో వ్యూహాత్మక మార్పు గురించి జియో అని పిలువబడే Google మ్యాప్స్ విభాగాధిపతి క్రిస్ ఫిలిప్స్ తాజాగా ఉద్యోగులకు తెలియజేశారు.

వేజ్ యాడ్స్ నిర్వహణను గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్‌కి మార్చాలని, Google Mapsతో అలైన్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీని ఫలితంగా అమ్మకాలు, మార్కెటింగ్, కార్యకలాపాలు, అనలిటిక్స్ లో Waze యాడ్స్ మానిటైజేషన్‌కు సంబంధించిన విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని వెల్లడైంది. ఈ మార్పు గురించి అడ్వర్టైజర్లు, భాగస్వాములకు తెలియజేయాలని కంపెనీ భావిస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం Waze యూనిట్‌లో ప్రస్తుతం 500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2013లో టెక్ దిగ్గజం గూగుల్ ఈ కంపెనీని 1.3 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెచ్ ఆదాయంలో భారీ క్షీణత నమోదు కావటంతో ఇప్పటి వరకు 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. అలాగే కంపెనీ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని ప్రాజెక్ట్‌లను తగ్గించటం, తొలగించటం చేపట్టింది.


Click it and Unblock the Notifications