Dell layoffs: పరిస్థితులు చిన్నగా మెరుగుపడుతున్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో అమెరికా టెక్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో డెల్ వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రఖ్యాత వార్తాసంస్థ బ్లూమ్ బెర్గ్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

డెల్ టెక్నాలజీస్..
యూఎస్ టెక్ సంస్థ డెల్ టెక్నాలజీస్ తన మెుత్తం గ్లోబల్ ఉద్యోగుల్లో 5 శాతం మందిని తగ్గించాలని నిర్ణయించినట్లు కంపెనీ సీనియర్ వెల్లడించారు. తాజాగా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కింద ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ దాదాపుగా 6,650 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడైంది. రానున్న కాలంలో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయని కంపెనీ అంచనా వేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది.

ఆపరేటింగ్ ఆఫీసర్..
కంపెనీ కో-ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ జఫ్ క్లెర్క్ ఉద్యోగులకు పంపిన మెమోలో అనిశ్చిత పరిస్థితుల గురించి ప్రస్థావించారు. డిపార్ట్‌మెంట్ పునర్వ్యవస్థీకరణలు, ఉద్యోగాల కోతలు సామర్థ్యాన్ని పెంచడానికి ఒక అవకాశంగా కంపెనీ భావిస్తోంది. అమెరికాలో ఉద్యోగుల తొలగింపులు జనవరిలో రెండేళ్ల కంటే ఎక్కువ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు టెక్ కంపెనీలు రికార్డు స్థాయిలో వేగంగా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.

కొత్తగా 30,000 ఉద్యోగాలు..
ప్రఖ్యాత అకౌంటింగ్ సేవల సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ తన సేవలను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. రానున్న 5 ఏళ్ల కాలంలో 30,000 కొత్త ఉద్యోగాలను కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను 50,000 నుంచి ఈ చర్య ద్వారా 80,000 లకు పెంచుకోవాలని చూస్తోంది. అనేక సంవత్సరాలుగా కంపెనీ ఇండియాలో తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పోతోంది.

2022లో విస్తరణ..
కంపెనీ 2022లో దేశంలోని భువనేశ్వర్, జైపూర్, నోయిడాలో మూడు కొత్త కార్యాలయాలను ప్రారంభించింది. నైపుణ్యాలు కలిగిన స్థానిక ప్రతిభావంతుల నియామకంపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు, వాటాదారుల పెరుగుతున్నందున.. అవసరాలకు అనుగుణంగా సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులను కూడా చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications