Layoff News: మళ్లీ అమెజాన్‌లో లేఆఫ్స్.. ఈ సారి టార్గెట్ వారే.. కొనసాగుతున్న ఆందోళలు
Amazon Layoffs: కొత్త ఏడాదిలో రోజులు గడుస్తున్న కొద్ది తొలగింపుల గందరగోళం కార్పొరేట్ కంపెనీల్లో మరింతగా పెరిగిపోతోంది. వాస్తవానికి చక్కబడాల్సిన పరిస్థితులు మరింతగా దిగజారటం అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆందోళనలకు గురిచేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో తొలగింపులు సంచలనంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అమెరికా టెక్, ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన హెల్త్‌కేర్ సెగ్మెంట్ నుంచి దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేసింది. ఇదే విషయాన్ని కంపెనీ హెల్త్‌కేర్ సర్వీసెస్ అధికారి నీల్ లిండ్సే ఉద్యోగులకు లేఖ ద్వారా వెల్లడించారు. అమెజాన్ కొత్త ట్యాబ్‌ను తెరిచిందని, దీని కారణంగా తన హెల్త్‌కేర్ యూనిట్‌లో కొన్ని వందల ఉద్యోగాలు తగ్గించబడతాయని అందులో పేర్కొన్నారు. ప్రభావితమయ్యే ఉద్యోగుల సంఖ్యను మాత్రం రివీల్ చేయలేదు.

అమెజాన్ వన్ మెడికల్, అమెజాన్ ఫార్మసీలో దాదాపు 115 స్థానాలు తొలగించబడవచ్చు. అంతే కాకుండా ఈ రంగంలో మరిన్ని ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశం ఉంది. మొత్తం 400 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని అంచనా వేయబడింది. ప్రస్తుత సమయంలో కంపెనీ తన వన్ మెడికల్ విభాగం నష్టాలను భారీగా తగ్గించాలని చూస్తున్న వేల తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అలా ఈ ఏడాది అదనంగా 100 మిలియన్ డాలర్లు ఆదా చేయవలసిందిగా హెల్త్‌కేర్ కంపెనీని అమెజాన్ కోరింది. వన్ మెడికల్ తన స్థిర నిర్వహణ ఖర్చులను మొత్తం ఆదాయంలో 41% నుంచి 20%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 2022లో అమెజాన్ వన్ మెడికల్‌ను 3.9 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
కొత్త ఏడాదిలో అమెజాన్ అనేక విభాగాల్లో తన ఉద్యోగులను తొలగింపులను ప్రకటిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 32,000 మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. తొలగింపులు చేస్తున్న కంపెనీలలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, సేల్స్‌ఫోర్స్ ఇంక్, మెటా ఇంక్ వంటి పెద్ద దిగ్గజాలు ఉన్నాయి. మెుత్తంగా 122 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో ఈ తొలగింపులు జరిగినట్లు Layoffs.fyi ప్రకటించింది. 2022-23లో ఏకంగా 4.25 లక్షల మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు డేటా వెల్లడించింది.


Click it and Unblock the Notifications