AI News: ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఉన్నోడికే పెళ్లి పెటాకులు అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ కొనసాగుతోంది. ఒకప్పుడు డాక్టర్లు, భూస్వాములు, పొలిటీషియన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న డిమాండ్ ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు కొనసాగుతోంది. పిల్లనివ్వాలంటే ముందు ప్యాకేజీ ఎంత అని అడుగుతున్న రోజులివి. అయితే ఇది భవిష్యత్తులో కనుమరుగు కావచ్చని తెలుస్తోంది.
విషయానికి వస్తే ప్రపంచంలో ఉద్యోగాల తీరుతెన్నులను ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. నిన్నమెున్నటి వరకు కొనసాగిన టెక్కీల అవసరం ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. దీంతో ప్రపంచంలోని పెద్ద ఐటీ సేవల కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ నియామక సరళిని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఉద్యోగులు వద్దు ఏఐ ముద్దు అన్నట్లుగా సదరు కంపెనీలు నూతన ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. మనుషుల ఖర్చులను తగ్గించుకోవటానికి ఇది వారికి పెద్ద అస్త్రంగా పనిచేస్తోంది.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన సేల్స్‌ఫోర్స్ కంపెనీ ఈ ఏడాది కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకోబోమని తేల్చి చెప్పేసింది. వాస్తవానికి ఇది పెద్ద సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని టెక్ కంపెనీలు ఇదే దారిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ సీఈవో మార్క్ ఈ విషయాన్ని ఒక పాడ్‌కాస్ట్ లో బాహాటంగా చెప్పటం ఐటీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న లక్షల మంది భారతీయులను కలవరానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం కంపెనీ ఏజెంట్ ఫోర్స్ అనే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై తన దృష్టిని కొనసాగిస్తున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ఏజెంట్ ఫోర్స్ AI, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల ద్వారా తన కంపెనీ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని దాదాపు 30 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్లే ఈ ఏడాది నియామకాలు వద్దనుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో సపోర్టు ఇంజనీర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని, సేల్స్ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్ ఉద్యోగుల సంఖ్యను డబుల్ చేయనున్నట్లు చెప్పారు.
మార్కెట్లో ఏఐ గురించి వివరంగా వివరించి మార్కెటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న సేల్స్ ప్రతినిధులను నియమించుకుంటున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగానే సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ కంపెనీలో ఏఐ పాత్రను పెంచుతున్నట్లు ధృవీకరించారు. ఇది ఉద్యోగుల స్థితిని మార్చటంతో పాటు కొన్ని ఉద్యోగాలను కనుమరుగుచేస్తుందని అభిప్రాయపడ్డారు.
సాంకేతిక పురోగతి మంచిదే అయినప్పటికీ అది సృష్టించే కొన్ని మార్పుల్లో భాగంగా పాత్రలు కనుమరుగు కావటం, కొందరు ఉద్యోగాలను కోల్పోవాల్సి రావటం సహజమైన ప్రక్రియగా పేర్కొన్నారు. రానున్న కాలంలో అనేక టెక్ కంపెనీలు కూడా ఇదే తరహాలో ఏఐని వినియోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications