Microsoft Layoff: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తొలగింపుల వేడి.. వారినే కంపెనీ టార్గెట్ చేసిందా..?
Microsoft Layoff: మెున్న ఇంటెల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ దూకుడు పెంచిన దిగ్గజ కంపెనీలు. ఈ దూకుడు ఉద్యోగులను తొలగించటంలో కావటం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.కొత్త ఉద్యోగాలు వస్తాయనుకుంటే ద్రవ్యోల్బణం సమయంలో ఉన్న ఉద్యోగాలు ఊడటంపై అనేక మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

వివిధ విభాగాల్లో..
యూఎస్ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏకంగా 1,000 మందిని తొలగించింది. జూలై నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించటం ఇది మూడోసారి కావటం దిగజారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోందని నిపుణులు అంటున్నారు. కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని ఈ విడతలో తొలగించినట్లు అమెరికా వార్తా పత్రికలు ప్రకటించాయి.

జూలై నుంచి పరిస్థితులు..
మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మెుత్తం 1.80 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే జూలై నుంచి పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో దాదాపు 1 శాతం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ తన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగంలోని 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ క్రమంలో తాను మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కోల్పోయానంటూ సీనియర్ ఉద్యోగి ప్రోడక్ట్ సూపర్‌వైజర్ కేసీ లెమ్సన్ ట్వీట్ చేశారు. ఖర్చుల భారం తగ్గించేందుకు కంపెనీ సీనియర్ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇంతటిలో ఆగవా..?
అమెరికాలో రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉబెర్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అనేక క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ల్లో ఈ తొలగింపులు కనిపించాయి. క్రంచ్ బేస్ డేటా ప్రకారం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఏకంగా 32,000 మందిని తొలగించినట్లు వెల్లడైంది. మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ బాట పట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్ కంట్రోల్ లోని మెటా రానున్న కాలంలో దాదాపు 12,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు సమాచారం.

మాంద్యం మాయ..
ఈ తొలగింపులకు ప్రధానంగా ఆర్థిక మందగమనం రూపంలో ఆవరిస్తున్న మాంద్యమే కారణంగా నిలుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆర్థికంగా కంపెనీలకు కలుగుతున్న నష్టాలను అదుపుచేసేందుకే కంపెనీలు ఈ ప్లాన్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో సైతం ఈ మందగమనం ఛాయలు కనిపిస్తున్నాయి. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు 98 శాతం తమ కొత్త నియామకాలను తగ్గించాయి. ఉన్న ఉద్యోగులతో మూన్ లైటింగ్ సమస్యను ఎదుర్కోవటానికి నయాప్లాన్స్ రచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications