అమెరికా టారిఫ్‌లతో భారత్‌ని తొక్కేయాలని ప్రయత్నిస్తోందని ప్రపంచమంతా చర్చిస్తోంది. అయితే ఈ ఆర్థిక యుద్ధంలో అసలు బలమైన కార్డులు మాత్రం భారత్ చేతిలోనే ఉన్నాయనే నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే, భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అమెరికాపైనే ఆధారపడటం లేదు. గ్లోబల్ సౌత్ మార్కెట్లలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఒక తలుపు మూసుకున్నా, మరో ఆరు తలుపులు తెరిచే స్థితిలో భారత్ ఉంది.

ఐఐఎఫ్‌టి ప్రొఫెసర్ దేబాసిస్ చక్రబోర్తి చెబుతున్నదేమిటంటే, అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు తాత్కాలిక ఒత్తిడి ఏ తప్ప దీర్ఘకాలిక వ్యూహం కాదని. అమెరికాకి భారత్ ఎంత ముఖ్యమో భారత్ ఉన్న ప్రదేశం ఎంత ప్రాధాన్యమో చూసి మళ్లీ మంచి సంబంధాలు పెట్టుకోవాల్సిందే. భారత మార్కెట్‌ని కోల్పోవడం అమెరికాకి ఏమాత్రం సరికాదు. అందుకే ప్రస్తుత టారిఫ్‌లను ఒక రకమైన రాజకీయ, ఆర్ధికంగా ఆట పట్టిస్తునట్టు
చూడొచ్చు.
చక్రబోర్తి అభిప్రాయ ప్రకారం, భారత్ ఇకపై అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడకుండా, ఎర్లీ హార్వెస్ట్ పాక్ట్స్ సాధించడం పైనే దృష్టి పెట్టాలి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి గ్లోబల్ సౌత్ మార్కెట్లలో విస్తరించాలి. అమెరికా మార్కెట్‌లో కేవలం 34 కోట్లు మంది వినియోగదారులు ఉన్నా, గ్లోబల్ సౌత్ మార్కెట్‌లో మాత్రం 600 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్యల తేడా ఒక్కటే భారత్ వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
యూరప్ యూనియన్‌తో భారత్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) కోసం చర్చలు జరుపుతున్నా, అక్కడి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (కార్బన్ పన్ను) భారత ఎగుమతిదారులకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. కార్బన్ ఉద్గారాల ఆధారంగా అదనపు పన్నులు విధించే ఈ విధానం కారణంగా భారత వస్త్రాలు, ఉక్కు వంటి రంగాల ఎగుమతులు ఎక్కువుగా ఖరీదయ్యే ప్రమాదం ఉంది. ఇది తాత్కాలిక సవాలే అయినప్పటికీ, భారత్ యూరప్ మార్కెట్‌కి ఎగుమతులు కొనసాగించాలంటే గ్రీన్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది.
మరోవైపు రష్యా మాత్రం భారత్‌కి స్వర్ణావకాశంగా కనిపిస్తోంది. భారత్-ఈఏఈయూ (EAEU) ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే ఔషధాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల ఎగుమతులు పెరగొచ్చు. వాణిజ్య అడ్డంకులు తగ్గి, మార్కెట్ విలువ పెరిగితే భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. రష్యా మార్కెట్‌తో పాటు యూరేషియన్ ప్రాంతం కూడా భారత వ్యాపారాలకు కొత్త దారులు తీసుకోస్తాయి.
అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సమయంలో, దేశీయ డిమాండ్ భారత్‌కు బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. రాబోయే జీఎస్టీ సంస్కరణలు, మార్కెట్లోకి వస్తున్న అదనపు ద్రవ్యం (liquidity) దేశీయ వినియోగాన్ని పెంచేలా చేస్తాయి. అంటే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా, దేశీయ డిమాండ్ వల్ల ఆ లోటును కొంతవరకు పూడ్చుకోవచ్చు. చక్రబోర్తి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు.
బీజేపీ నాయకుడు సావియో రోడ్రిగ్స్ అభిప్రాయం ప్రకారం, అమెరికా విధిస్తున్న 50% టారిఫ్‌లు టెక్స్టైల్, లెదర్ వంటి కార్మికాధారిత రంగాలను దెబ్బతీయొచ్చు. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొనే శక్తి కలిగి ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
రోడ్రిగ్స్ అభిప్రాయం ప్రకారం, భారత్ ఎప్పటికప్పుడు ఎగుమతి మార్కెట్లను వేరు చేసుకుంటూ యూరప్, ఆఫ్రికా, ఆసియాన్ ప్రాంతాలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా పెరుగుతున్న దేశీయ డిమాండ్ కూడా ప్రపంచంలో జరిగే అస్పష్టతలను ఎదుర్కొనే బలమైన కవచంగా నిలుస్తోంది.
మొత్తం మీద అమెరికా టారిఫ్‌లతో భారత్‌కి తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం భారత్ చేతిలోనే బలమైన కార్డులు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. గ్లోబల్ సౌత్ మార్కెట్లు, రష్యాతో ఒప్పందాలు, యూరప్‌తో వ్యాపార చర్చలు, దేశీయ వినియోగం ఇవ్వన్ని కలిసి భారత్‌ని మరింత దృడంగా నిలిపేలా చేస్తున్నాయి. అమెరికా ఒత్తిడి తాత్కాలికమే, కానీ భారత్‌కి ముందున్న మార్గాలు చాలా విశాలంగా ఉన్నాయి.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications