కరోనా మహమ్మారి తర్వాత చైనాలోని అమెరికా కంపెనీలు ఇప్పుడు భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్నాయి. వీరికి అమెరికా విదేశాంగ శాఖ కూడా మద్దతిస్తోంది. ఇప్పటి వరకుచైనా కేంద్రంగా జరిగిన కార్యకలాపాలను భారత్ తరలిస్తే బాగుంటుందని అమెరికా బహుళజాతి కంపెనీలు భావిస్తున్నాయి. తమ పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తున్నాయి. గత వారం అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్, భారత్‌లోని దిగ్గజ అమెరికా కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది.

భారత్ వైపు నడుద్దాం
భారత్ ప్రాధాన్యత గురించి, చైనా నుండి ఇండియాకు కంపెనీల కార్యకలాపాల తరలింపు అవశ్యకతను గురించి సభ్యులు చర్చించారు. ప్రస్తుతం చైనా కేంద్రంగా నడుస్తోన్న పారిశ్రామిక కార్యకలాపాలను భారత్‌కు తరలించవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్ దక్షిణాసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ థామస్ అన్నారు. భారత ప్రభుత్వాన్ని అవసరమైన ప్రోత్సాహకాలు కోరాలని కూడా ఈ కంపెనీలు నిర్ణయించాయట. అదే దారిలో మరిన్ని కంపెనీలు నడిచే అవకాశముందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

చైనాకు ప్రత్యామ్నాయం
కరోనా పుట్టిన చైనా నుండి వివిధ దేశాల కంపెనీలు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అక్కడి విదేశీ సంస్థలు తమ కర్మాగారాలను క్లోజ్ చేసే పరిస్థితి. దీంతో ఆయా దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా కంపెనీలు.. చైనా నుండి భారత్ తరలించడం మంచిదిగా భావిస్తున్నాయి. దీనికి ట్రంప్ సర్కార్ మద్దతు ఉండటం గమనార్హం.

భారత్‌కు అద్భుత అవకాశం
ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలకు భారత్ త్వరగా అనుకూలమైనదిగా మారగలదని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా దేసాల అసిస్టెంట్ కార్యదర్శి థామస్ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కంపెనీలు తరలి వచ్చేందుకు సహాయపడతాయని అంటున్నారు. చైనా నుండి తరలి వెళ్లే సంస్థలు సహా విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది భారత్‌కు సరైన సమయమని, అందుకు తగిన విధంగా వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉందని చెబుతున్నారు. ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతుల విషయమై దృష్టి సారించాలని చెబుతున్నారు.

అవకాశాలు అందిపుచ్చుకోవాలి
అమెరికా సంస్థల విస్తరణకు అనుగుణంగా ఇండియా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. అప్పుడే చాలా సంస్థలు వస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు మోడీ ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయా సంస్థలు ట్రంప్ సర్కారును కోరుతున్నాయట. కాగా, కరోనా కారణంగా చైనాకు వాటిల్లే నష్టం భారత్‌కు లాభించగలదని, దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనా నుండి కంపెనీలు వెళ్లిపోవాలని చూస్తున్నాయని, ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications