ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోను బుధవారం ప్రపంచం క్లీన్ టెల్కోస్ జాబితాలో చేర్చారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో. చైనా దిగ్గజం హువావే టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ (హువావే) వ్యాపారాన్ని నిరాకరించిన నేపథ్యంలో ఈ జాబితాలో చేర్చారు. ఈ మేరకు పాంపియో నిన్న ట్వీట్ చేశారు. ప్రపంచ దిగ్గజ టెలికం కంపెనీలు టెలెఫోనికా, ఆరెంజ్, జియో, టెల్‌స్ట్రా తదితర కంపెనీలు క్లీన్ టెల్కోస్ అవుతున్నాయని, హువావేకు దూరం జరుగుతున్నాయని, తద్వారా హువావే లాంటి సీసీపీ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) నిఘా సాధనాలతో వ్యాపారం చేయడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. హువావేను చైనా సైనిక నియంత్రణలో ఉన్న టెల్కోగా పేర్కొన్నారు.

అందుకే జియోకు క్లీన్ చిట్
అమెరికా విదేశాంగ కార్యదర్శి కొంతకాలంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీపై, చైనా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతాపరమైన ఆందోళనతో చైనాకు చెందిన హువావేపై ఆంక్షలు కూడా విధించారు. ఈ నేపథ్యంలో హువావేతో వ్యాపారానికి నిరాకరించింది. హువావే ఎక్విప్‌మెంట్స్‌కు నో చెప్పింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోను క్లీన్ టెల్కోగా పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేబుల్ అయిన హువావే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది అమెరికా. జియోతో పాటు కెనడా, బ్రిటిష్, ఫ్రెంచ్ టెలికం సంస్థలు కూడా హువావే పరికరాలకు దూరం జరుగుతున్నాయని పాంపియో చెప్పారు. సీసీపీ నిఘా నేపథ్యంలో హువావే వంటి కంపెనీలతో బిజినెస్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

పరీక్షల కోసం జియో..
ప్రపంచంలో చైనీస్ కాంపోనెంట్ లేనిది కేవలం జియో మాత్రమేనని ఫిబ్రవరిలో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో ముఖేష్ అంబానీ చెప్పారు. జియో 5జీ కోసం స్వదేశీ మార్గాన్ని ఎంచుకుంటోంది. థర్ట్ పార్టీ భాగస్వామ్యం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం కోసం పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కూడా డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం (DoT)కి దరఖాస్తు చేసుకుంది.

పౌరుల భద్రత
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సంబంధాలు క్షీణించాయి. ఒకరిపై మరొకరు అధిక సుంకాలు విధించుకుంటున్నారు. ఇదే సమయంలో అమెరికాతో సహా పలు యూరోపియన్ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు హువావే వంటి చైనా కంపెనీలపై భద్రతా సమస్య లేవనెత్తాయి. 5జీ టెక్నాలజీలో చైనా ముందుంది. చైనా కంపెనీలు తయారు చేసే పరికరాలను ఆమోదిస్తే తమ పౌరుల డేటాకు భద్రత ఉండదని భావిస్తున్నాయి. భారత్‌లోను హువావే 5జీ వేలం కోసం నిరాకరించని పరిస్థితుల్లో, ఈ చైనా కంపెనీ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.

ఫేస్‌బుక్-జియో డీల్‌కు ఓకే
మరోవైపు, రిలయన్స్ జియోలో రూ.43,574 పెట్టుబడి ద్వారా ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోద ముద్ర లభించింది. జియోకు 388 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ - జియో డీల్ ఏప్రిల్ 22న కుదిరింది.


Click it and Unblock the Notifications