America: అమెరికాన్లకే మొదటి ప్రాధాన్యత.. భారతీయులు తిరిగి ఇంటికి రావాల్సిందేనా..!
అమెరికా ప్రభుత్వంలో నివసిస్తున్న విదేశీయులు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు దేశం వెళ్లగొడతారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం విదేశీయుల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇటీవల మారుతున్న వర్క్ వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల గురించి వస్తున్న ఆందోళనలను ఆయన ఖండించారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కాదని రూబియో స్పష్టం చేశారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇండియానే టార్గెట్ చేసి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చుతున్నారు, టైట్ చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
అమెరికా ఎప్పుడూ తన దేశ కార్మికులకు, జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రూబియో తేల్చి చెప్పారు. భారత ప్రభుత్వం కూడా ఎప్పుడూ తన దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కూడా తమ ప్రజలను, తమ కార్మికులను, తమ దేశాన్ని మొదట ఉంచుతుందని రూబియో స్పష్టం చేశారు. భారత్‌ను టార్గెట్ చేసి నిబంధనలు మార్చలేదని.. ఇది పూర్తిగా గ్లోబల్ పాలసీ అని తేల్చి చెప్పారు. గతంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అనేక లోపాలు ఉండేవని, బిజినెస్-సంబంధిత ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌లలో మోసాలు, దుర్వినియోగాలు విపరీతంగా జరిగాయని రూబియో తెలిపారు.

ఈ సమస్యలను పరిష్కరించడానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 9న కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ ఐటీ దిగ్గజాలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలను కూడా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్(గ్రీన్ కార్డ్) నుంచి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలపై ఫెడరల్ దర్యాప్తులు జరుగుతున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఎఫ్-1 స్టూడెంట్స్ OPTపై కూడా కొత్త ఫీజులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అమెరికన్ కార్మికులను రక్షించడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకలు అమెరికా-భారత్ రెండింటికీ ప్రయోజనకరమని రూబియో అన్నారు. నిపుణుల రాక ఇన్నోవేషన్, ప్రొడక్టివిటీకి తోడ్పడుతాయని భారత్ స్పష్టం చేసింది. అమెరికా తాజా చర్యలు రెండు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు మద్దతుగా లేవని భారత్ పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications