చౌకైన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అమెరికా రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. భారత బియ్యం, కెనడియన్ ఎరువులు సహా అనేక వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను విధించవచ్చనే సంకేతాలిచ్చారు. ఇంతకుముందే అమెరికా రైతులకు 12 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్.. వైట్ హౌస్ సమావేశంలో టారిఫ్స్ మీద పరోక్ష సంకేతాలిచ్చారు. అమెరికా వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని, అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
అమెరికా మార్కెట్లో భారతీయ బియ్యం డంపింగ్ జరగుతున్నదని ఆరోపిస్తూ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల నుండి భారీ స్థాయిలో దిగుమతులు రావడం వల్ల అమెరికా బియ్యం ధరలు పడిపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. విదేశీ బియ్యం చౌకగా మార్కెట్లోకి రావడంతో దేశీయ రైతుల పంటలు అమ్ముడుపోకుండా నిల్వల్లోనే పేరుకుపోతున్నాయనే వాదనను ట్రంప్ ప్రస్తావించారు. వారు (ఇతర దేశాలు) డంపింగ్ చేయకూడదు... నేను ఇతరుల దగ్గర నుండి విన్నాను. మీరు అలా చేయలేరని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా వ్యవసాయ వర్గాలలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.

అలాగే, వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకతకు కీలకమైన ఎరువుల విషయంలో కూడా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉపయోగించే ఎరువులలో ఎక్కువ భాగం కెనడా నుండి దిగుమతి అవుతున్నదని పేర్కొంటూ.. ఆ దిగుమతులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉందని సూచించారు. మన దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇది అవసరం కావచ్చు. మేము దానిని ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ఆయన వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఒత్తిడులు, వినియోగదారుల ధరల పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. రైతులు పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ఇంధన ధరల పెరుగుదల, మార్కెట్ అస్థిరతలతో బాధపడుతున్నారు. వీటిలో చాలా వరకు ట్రంప్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సుంకాలకు ఆధారితమైన వాణిజ్య విధానాల ప్రభావంగా భావిస్తున్నారు. అదే సమయంలో, అమెరికా-భారత్, అమెరికా-కెనడా వాణిజ్య సంబంధాలు కూడా ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్నాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారు, వాణిజ్య అడ్డంకులు, భారత ఇంధన కొనుగోళ్లు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. మరిన్ని చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం త్వరలో భారతదేశానికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిలో పురోగతి ఆశించలేమని అధికారులు భావిస్తున్నారు. కెనడాతో కూడ ట్రంప్ పదేపదే వాణిజ్య ఒప్పందాలపై పునర్ పరిశీలన అవసరం ఉందని అంటున్నారు. ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందం (NAFTA) పరిధిలోకి రాని కొన్ని వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేయడం ఈ సంబంధాలపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ తాజా వ్యాఖ్యలు NAFTA ఒప్పందం మళ్లీ తెరవబడుతుందా అన్న అనుమానాలను పెంచుతున్నాయి.
More From GoodReturns

Iran war: ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకనున్న ట్రంప్? డెడ్ లైన్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications