No Income Tax: అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్ లోకి అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ట్రంప్ మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇది కోట్ల మంది అమెరికన్లు హర్షించే నిర్ణయం కానుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రెసిడెండ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా సిటిజన్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని చూస్తున్నారని వెల్లడైంది. దీని ద్వారా అమెరికా ప్రజలతో పాటు వారి కుటుంబాల్లో ఖర్చు చేయదగిన ఆదాయాన్ని పెంచే క్రమంలో ఈ ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఈ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగానే శక్తివంతమైన, ధనికదేశంగా మార్చిన విధానానికి తిరిగి యునైటెడ్ స్టేట్స్ తిరిగి వెళ్లాల్సిన సమయం మళ్లీ వచ్చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ట్రంప్ ప్రధానంగా అమెరికన్లపై పన్నులు విధించటం కంటే దిగుమతులపై పన్నులను పెంచే ఉద్ధేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఇటీవల మాట్లాడుతూ అమెరికా కోసం ఉత్పత్తి చేయాలనుకునేవారికి తమ ప్రభుత్వం తోడుటుందని, భూమిమీద అత్యల్ప పన్నులను అందిస్తామని మాట ఇచ్చారు. అలా కాని పక్షంలో దిగుమతులపై అధిక పన్నుల ద్వారా అమెరికా ట్రెజరీకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వ్యాపార సంస్థలకు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ట్రంప్ తాజా నిర్ణయం ద్వారా అమెరికా ఫ్రెడరల్ రిజర్వుకు ఆదాయపు పన్నుల నుంచి వస్తున్న ఆదాయాన్ని టారిఫ్స్ కవర్ చేస్తాయని తెలుస్తోంది. 1870-1913 మధ్య కాలాన్ని సుంకాల నుంచి ఆదాయం ద్వారా నడిపిన ఆర్థిక విజయానికి ఉదాహరణగా ట్రంప్ ఉదహరించారు. ఆ కాలంలో సాధించిన సంపదతో పాటు ఆర్థిక వృద్ధిని తాజాగా ట్రంప్ హైలైట్ చేశారు. అమెరికాలో ఆదాయపు పన్ను విధానం 1913లో వచ్చిందని, దీనికి ముందు ప్రజలపై ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్నులు లేవని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సమయంలో డబ్బుతో పార్కులు, ఇతర అభివృద్ధి పనులు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.
వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలను ధనికదేశాలుగా మార్చటానికి అమెరికన్లపై పన్నులు వసూలు చేయటం కంటే అమెరికా కోసం ఇతర దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెంచటం ఉత్తమంగా తాను భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇదే అమెరికన్లను సంపన్నులుగా మార్చటానికి సరైన మార్గంగా ట్రంప్ వెల్లడించారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Tax Regime: జీతం పెరిగినా చేతికి వచ్చే డబ్బు తగ్గుతుందా? కొత్త టాక్స్ రూల్స్‌లో అసలు ట్విస్ట్ ఇదే!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications