డేటా సెంటర్ల వేళ భారత్ కి బిగ్ షాకిచ్చిన అమెరికా.. ఏఐ చిప్స్ కొనుగోలుపై కఠినమైన ఎగుమతి ఆంక్షలు..

US Nvidia Chip Restrictions: ప్రపంచ దేశాలకు అమెరికా మరో షాకిచ్చింది. చైనా కంపెనీలు, ఇతర అమెరికా వ్యతిరేక దేశాలు విదేశీ డేటా సెంటర్ల ద్వారా అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంప్యూటింగ్ శక్తిని పొందకుండా అడ్డుకునేందుకు అమెరికా వాణిజ్య శాఖ కఠినమైన కొత్త ఎగుమతి ఆంక్షలను ప్రకటించింది.

నవంబర్ 16న విడుదల చేసిన మధ్యంతర నిబంధనల ప్రకారం.. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, బ్రెజిల్ సహా మొత్తం 12 దేశాల్లోని డేటా సెంటర్ ఆపరేటర్లు ఎన్విడియా వంటి అమెరికన్ తయారీదారుల నుండి అత్యాధునిక ఏఐ చిప్‌లను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా అమెరికా ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ప్రభావితమయ్యే 12 దేశాల జాబితాలో భారతదేశంతో పాటు మెక్సికో, ఫిలిప్పీన్స్, వియత్నాం, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా ఉండటం గమనార్హం.

US Nvidia chip ban Nvidia chip restrictions China AI chip ban US export controls 12 countries Nvidia ban India Nvidia chip restrictions AI semiconductor export rules Nvidia news November 2026 US China technology war AI data center restrictions AI 12 Nvidia chip ban AI

చైనాకు నేరుగా ఏఐ చిప్‌లను ఎగుమతి చేయడంపై ఇప్పటికే నిషేధం ఉన్నప్పటికీ, చైనా సంస్థలు మూడవ దేశాల్లోని డేటా సెంటర్ల క్లౌడ్-కంప్యూటింగ్ నెట్‌వర్క్‌లకు రిమోట్ యాక్సెస్ ద్వారా అమెరికన్ సెమీకండక్టర్ సాంకేతికతను వినియోగించుకుంటున్నాయనే ఆందోళనలు వాషింగ్టన్‌లో పెరిగాయి. ఈ లొసుగులను పూర్తిగా మూసివేసేందుకే ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు అమెరికా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. భౌతిక రవాణాపై ఉన్న పరిమితులను రిమోట్ కంప్యూటింగ్ ఏర్పాట్లకు కూడా విస్తరిస్తూ, ఈ దేశాల్లోని లైసెన్స్ దరఖాస్తులను ఒక్కో కేసు ప్రాతిపదికన (Case-by-Case) పరిశీలించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఈ దేశాల్లో సాంకేతికత దారి మళ్లే ప్రమాదం (Diversion Risk) సాధారణం కంటే ఎక్కువగా ఉందని నిబంధనలు వివరిస్తున్నాయి.

Also Read

అయితే ఈ కొత్త ఆంక్షలలో కొన్ని కీలక మినహాయింపులను కూడా అమెరికా కల్పించింది. జాబితాలో ఉన్న దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా ప్రధాన కార్యాలయాలు కలిగిన కంపెనీలు ఎటువంటి ప్రత్యేక లైసెన్స్ లేకుండానే తమ డేటా సెంటర్లకు ఏఐ చిప్‌లను తరలించవచ్చు. అలాగే, ఆన్‌లైన్ రిటైలర్లు, సోషల్ మీడియా సంస్థల వాణిజ్య సిఫార్సు వ్యవస్థల కోసం ఉపయోగించే డేటా సెంటర్లకు కూడా మినహాయింపు ఇచ్చారు. ఈ ముసాయిదా నిబంధన ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమైన వెంటనే అమల్లోకి రానుంది.

ఇటీవల ఎన్విడియా, సింగపూర్ ఆధారిత మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ సంస్థలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. అమెరికా ఎగుమతి నియంత్రణల అమలుపై వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, వాణిజ్య శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ సైతం ఆంక్షల కఠినతరం విషయంలో వాణిజ్య శాఖ వేగంగా స్పందించాలని ఒత్తిడి తెచ్చారు. చివరకు ట్రెజరీ విభాగం, జాతీయ భద్రతా మండలి ఆదేశాల మేరకు ఈ కఠిన నిబంధనలను రూపొందించారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ టెక్ మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్లో ఎన్విడియా షేర్లు 2.9 శాతం వరకు పడిపోగా, ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ ఏకంగా 5.5 శాతం కుప్పకూలింది. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న భారత్ సహా 12 దేశాల్లోని డేటా సెంటర్ల విస్తరణ ప్రణాళికలపై ఈ తాజా అమెరికా నిబంధనలు గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+