Deloitte Jobs: MNCల్లో ఉద్యోగాలు సంపాదించాలని అనుకోవటం చాలా మంది యువతకు ఉండే కోరిక. వాటిలో ఎప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసినా దరఖాస్తు చేసేందుకు ఉత్తాహం చూపుతుంటారు. అయితే అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ డెలాయిట్ తాజాదా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఉద్యోగ ఓపెనింగ్స్..
ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియాలో కంపెనీ సెక్రటరీ(CS), చార్టర్డ్ అకౌంటెంట్(CA), లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా.. కంపెనీ రెగ్యులేటరీ బృందానికి డిప్యూటీ మేనేజర్ ట్యాక్స్ మెర్జర్ అండ్ అక్విజిషన్ పోస్టుకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సెలక్ట్ అయిన వారు బెంగళూరు కార్యాలయంలో విధులు నిర్వహించవలసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

విద్యార్హతలు ఇవి..
కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి డిగ్రీ పూర్తిచేసిన లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల టీమ్ లీడ్ అనుభవం అవసరమని కంపెనీ వెల్లడించింది. ఇలాంటి వారికి మెుదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది.

చేయవలసిన పని..
1. కంపెనీల చట్టం- 2013, FEMA రూల్స్, SEBI నిబంధనలు, NBFC రూల్స్, LLP, స్టాంప్ డ్యూటీ, కాంపిటీషన్ యాక్ట్ కన్సల్టింగ్ సహా ఇతర కార్పొరేట్ చట్టాలకు సంబంధించిన అంశాలపై పని చేయవలసి ఉంటుంది.
2. రెగ్యులేటరీ టీమ్ లో భాగంగా ఉంటూ.. కంపెనీకి, క్లయింట్‌కు సలహా ఇవ్వడం.
3. కంపెనీల మెర్జర్, డీ-మెర్జర్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ పర్యవేక్షణ, సమీక్ష మొదలైన విషయాలను కోఆర్డినేట్ చేయటం.
4. స్థానిక ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వ నియంత్రణ సంస్థలు జారీ చేసే పేపర్లు, బిల్లులు, విధానాలను నిరంతరం ఫాలో అవ్వటం, వాటిపై క్లయింట్లకు సమాచారం అందించటం

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటం కోసం అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి. కెరీర్స్ విభాగంలో ఆన్ లైన్ ద్వారా అప్లై ఎంపికను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అక్కడ కంపెనీ అడిగిన అన్ని వివరాలను పూరించాలి. ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications