అమెరికా-భారత మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ దిగుమతులపై అదనపు 25% పన్ను విధిస్తుంటే, మరోవైపు యాపిల్ కంపెనీ అమెరికాలో తయారీని పెంచేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

యాపిల్ తాజాగా ప్రకటించిన ప్రకారం, వారు మరిన్ని $100 బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టబోతున్నారు. ఇప్పటికే ఉన్న $500 బిలియన్ పెట్టుబడితో కలిపి, వచ్చే నాలుగేళ్లలో మొత్తం పెట్టుబడి $600 బిలియన్‌కు చేరుతుంది. కొంత కాలం క్రితం వరకూ యాపిల్ తయారీకి ఎక్కువగా చైనాపైనే ఆధారపడేది. ఇప్పుడు ఇండియా, అమెరికా, వియత్నాం వంటి దేశాల్లో కూడా ఫ్యాక్టరీలు పెడుతోంది. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థలో వచ్చిన సమస్యల వల్ల, ఒక్క దేశంపై ఆధారపడకుండా తయారీని పంచుకుంటోంది.
యాపిల్ CEO టిమ్ కుక్ మాట్లాడుతూ, "అమెరికాలోనే ఇప్పటికే 19 బిలియన్ విలువ చేసే చిప్స్ తయారు చేస్తున్నాం. ఇంకా చాలా స్థాయిలో పెరగాలనుకుంటున్నాం," అని చెప్పారు. ఇప్పుడు ఐఫోన్లకు అవసరమైన గ్లాస్ డిస్ప్లేలు, ఫేస్ రికగ్నిషన్ భాగాలు కూడా అమెరికాలోనే తయారవుతున్నాయని, US తయారీ నాణ్యతగా మారుతోందని వివరించారు. టెక్సాస్‌లో ఉన్న ఫ్యాక్టరీను పెంచేందుకు యాపిల్, MP Materials అనే కంపెనీతో $500 మిలియన్ ఒప్పందం కూడా చేసుకుంది. దీని వల్ల ఐఫోన్లలో వాడే రీసైకిల్ మాగ్నెట్లు తయారు చేయగలుగుతారు.
ఈ ఏడాది మొదట్లో ట్రంప్, యాపిల్ ఇండియాలో తయారీ పెంచుతోందని చెప్తు అది "చిన్న సమస్య" అని అన్నారు. ఖతార్‌లో టిమ్ కుక్‌తో మాట్లాడినప్పుడు ఇండియాలో తయారీ చేయొద్దని నేను అనుకుంటున్నాను అని చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాత కొన్ని వారాలుగా రెండు వైపులా వాణిజ్య ఒత్తిడులు నెలకొన్నాయి. ఎట్టకేలకు, యాపిల్ అమెరికా తయారీపై తిరిగి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ వార్త వచ్చిన వెంటనే యాపిల్ షేర్ ధరలు 6 శాతం పెరిగాయి. లాఫర్ టెంగ్లర్ పెట్టుబడులు సీఈఓ నాన్సీ టెంగ్లర్ ఇలా చెప్పారు "టిమ్ కుక్ ట్రంప్‌కు సహకారం చూపిస్తున్నారని మార్కెట్‌కు అనిపించడంతో షేర్ ధరలు పెరిగినట్టు ఉంది. అయితే యాపిల్ షేరు ధరలు ఇప్పటికీ ఈ ఏడాది మొత్తం 14% క్షీణించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో యాపిల్ కొంచెం ఆలస్యంగా ముందుకువచ్చింది. అందుకే ఇప్పుడు కంపెనీ తన బలమైన రంగాలైన హార్డ్‌వేర్, తయారీ మీద మళ్లీ దృష్టి పెడుతోంది.
మొత్తానికి, ఒకవైపు ట్రంప్ వ్యాఖ్యలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై సందిగ్ధత నెలకొంటే, మరోవైపు యాపిల్ కంపెనీ భారీ పెట్టుబడులతో అమెరికాలో తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ముందడుగు వేసింది. ఈ రెండు పరిణామాలు ఒకేరోజు చోటుచేసుకోవడం, యాపిల్ షేర్ ధరలు ఒక్కసారిగా పెరగడం వంటి అంశాలు టెక్ ప్రపంచంలో ఆసక్తికర మలుపుగా మారాయి. ఇకపై ఈ వ్యూహాత్మక మార్పులు అమెరికా టెక్ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications