IT Layoffs: కొత్త యాజమాన్యంలో ఉద్యోగుల కోత..! గడ్డు పరిస్థితుల్లో యూఎస్ కంపెనీ.. గూగుల్ కూడా

Salesforce: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోతకు కొంత విరామం వచ్చిందని భావించే లోపే మరో షాకింగ్ వార్త వచ్చేసింది. కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిన తర్వాత ప్రఖ్యాత యూఎస్ టెక్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ తాజా రౌండ్ లేఆఫ్‌ల సిద్ధమైంది. ఈ నెల ప్రారంభంలోనే కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారిన తర్వాత ఈ ప్రకటన రావటం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

యాజమాన్య మార్పు..

యాజమాన్య మార్పు..

కంపెనీ వైస్ చైర్, సీఈవో అయిన బ్రెట్ టేలర్ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించగా.. కంపెనీ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియోఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి కొత్త చైర్, CEOగా నియమితులయ్యారు. అమెరికన్ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ ఉద్యోగులు కొత్త మేనేజ్‌మెంట్ కింద తాజా రౌండ్ తొలగింపులను ఎదుర్కొనే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో అవి ఎంత మంది తొలగింపులకు దారితీస్తాయనే ఊహాగానాలు రేకెత్తుతున్నాయి.

కొత్త టార్గెట్లు..

కొత్త టార్గెట్లు..

యాజమాన్యం చేతులు మారిన తర్వాత కంపెనీ కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఉద్యోగులు వాటిని అందుకోలేక పోయినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తొలగించేందుకే కంపెనీ పరోక్షంగా చేరుకోలేని టార్గెట్లను ఇచ్చినట్లు ఒక ఉద్యోగి వాపోయాడు. అయితే చాలా ఆలోచన తర్వాతే తాను వ్యవస్థాపక మూలాలకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు టేలర్ ఒక ప్రకటనలో తెలిపారు.

 తగ్గిన కంపెనీ రేటింగ్.

తగ్గిన కంపెనీ రేటింగ్.

.

సేల్స్‌ఫోర్స్‌లో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ అయిన బైర్డ్ గత వారం కంపెనీ రేటింగ్ ను 'OUTPERFORM' నుండి 'న్యూట్రల్'కి తగ్గించింది. దీంతో కంపెనీ షేర్ విలువ సైతం కొంత పతనమైంది. ఉన్నత స్థాయి యాజమాన్యంలో నిష్క్రమణలను రేటింగ్ తగ్గింపుకు ఒక కారణంగా సదరు బ్యాంక్ వెల్లడించింది.

 కంపెనీ ఆర్థిక పరిస్థితులు..

కంపెనీ ఆర్థిక పరిస్థితులు..

ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఏడాది డిసెంబర్ 13న కంపెనీ స్టాక్ 265.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కానీ ఇప్పుడు దాని ధర 49.91 శాతం క్రాష్ అయి మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో 133.11 డాలర్ల వద్ద ముగిసింది. కంపెనీ నవంబర్ మాసంలో 2500 మందిని తొలగించినట్లు ప్రోటోకాల్ నివేదించింది. అయితే కంపెనీ మాత్రం 1000 కంటే తక్కువ మందిని మాత్రమే తొలగించినట్లు పేర్కొంది.

 గూగుల్ పరిస్థితి..

గూగుల్ పరిస్థితి..

టెక్ జెయింట్ గూగుల్ సైతం 2023లో భారీగా ఉద్యోగులను తొలగించవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై ఆందోళనగా ఉన్న కొందరు ఉద్యోగులు సీఈవో సుందర్ పిచాయ్ ను వీటికి సంబంధించి క్లారిటీ కోరారు. ఉద్యోగుల ప్రశ్నకు ఒక్క ప్రశ్నలో బదులిచ్చిన సుందర్ పిచాయ్ "భవిష్యత్తును అంచనా వేయడం కష్టం" అని బదులిచ్చారు. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ రాబోయే వారాల్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత వారం నివేదించబడింది. గత వారం అందరితో కలిసి సమావేశం తర్వాత Googleలో విషయాలు ఉద్రిక్తంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+