For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Inflation: తగ్గిన యూఎస్ ద్రవ్యోల్బణం.. స్టాక్ మార్కెట్లకు సానుకూలమేనా..!

|

డిసెంబర్‌లో US ద్రవ్యోల్బణంకనిష్ట స్థాయి 6.5 శాతానికి పడిపోయింది. గరిష్ఠం నుంచి ఆరోవసారి క్షీణతను నమోదు చేసింది. 2022లో గరిష్ట ఉన్న ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. US CPI గత నెలతో పోలిస్తే 0.1 శాతం తగ్గింది. ఫెడ్ రేట్ల పెంపుదల ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వానికి దోహదపడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

గరిష్ఠ స్థాయి

గరిష్ఠ స్థాయి

అమెరికా ద్రవ్యోల్బణం అక్టోబర్ 2021 నుంచి పెరుగుతూ వస్తూ జూన్ 2022లో గరిష్ఠ స్థాయి 9.1 చేరింది.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడరల్ రిజర్వ్ గత కొన్ని నెలలుగా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఫెడ్ అధికారులు ఇప్పటికీ US ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

ధరలు

ధరలు

2024 సంవత్సరం వరకు ద్రవ్యోల్బణం దాని 2 శాతం తగ్గించాలని ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్‌లో 2.0% తగ్గిన తర్వాత గ్యాసోలిన్ ధరలు 9.4% పడిపోయాయి. కానీ సహజ వాయువు ధర 3.0% పెరిగింది. ఆహార ధరలు 0.3% పెరిగాయి. "ఫెడ్ ఒక వేగాన్ని తగ్గించినప్పటికీ, అది దాని తదుపరి సమావేశాన్ని కఠినతరం చేస్తూనే ఉంటుంది" అని న్యూయార్క్‌లోని వెల్స్ ఫార్గో వద్ద ఆర్థికవేత్త మైఖేల్ పుగ్లీస్ అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుదల స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపొచ్చు.

రిటైల్‌ ద్రవ్యోల్బణం

రిటైల్‌ ద్రవ్యోల్బణం

ఇటు భారత్ లో డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠమైన 5.72 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022 నవంబరులో 5.88 శాతం కాగా, 2021 డిసెంబరులో 5.66 శాతంగా ఉంది.

English summary

US Inflation: తగ్గిన యూఎస్ ద్రవ్యోల్బణం.. స్టాక్ మార్కెట్లకు సానుకూలమేనా..! | US inflation has declined for the sixth time in a row

US inflation fell to a record low of 6.5 percent in December. It recorded the sixth decline since the peak.
Story first published: Friday, January 13, 2023, 10:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X