మన టెక్కీలకు షాక్, H1B వీసాల నిలిపివేతపై ట్రంప్ కీలక నిర్ణయం: అమెరికా టెక్ సంస్థలకే నష్టమా?

కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికాలో కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలల కాలంలో జాబ్ లాస్ కారణంగా 44 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హెచ్1బీ వీసాలు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

హెచ్1బీ వీసాల నిలుపుదల...

హెచ్1బీ వీసాల నిలుపుదల...

కరోనా కారణంగా కోట్లాదిమంది నిరుద్యోగులుగా మారడంతో తమ పౌరులకు ఉపాధి కల్పించేందుకు ట్రంప్ అనేక మార్గాలు అన్వేషిస్తున్నారని, ఇందులో ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలం పాటు నిలిపివేసే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా వెల్లడించింది. అమెరికాలో ఉండే వారిలో ఎక్కువగా భారతీయులు. వీరిలో చాలామంది వృత్తిపరమైన నిపుణులకు ఇచ్చే హెచ్1బీ పైన ఉంటారు. ట్రంప్ వీటిని నిలిపివేయాలని భావిస్తున్న వీసాల్లో ఇది కూడా ఉంది.

ఇండియన్ టెక్కీలపై ప్రభావం

ఇండియన్ టెక్కీలపై ప్రభావం

అమెరికా వెలుపల ఉన్నవారికి మాత్రమే ఇది వర్తించనుందట. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఉన్నావారిపై ప్రభావం చూపదు. ట్రంప్ దీనికి మొగ్గుచూపితే మన దేశానికి చెందిన టెక్కీలపై ప్రభావం పడే అవకాశముంది. కరోనా నేపథ్యంలో హెచ్1బీ వీసాలు కలిగినవారు చాలామంది ఉద్యోగాలు కోల్పోయి, భారత్‌కు తిరిగి వచ్చారు. వీరు తిరిగి వెళ్లాలని భావించినా లేదా కొత్తగా ఎవరైనా వెళ్లాలని భావించినా కొంతకాలం ఇబ్బంది కావొచ్చునని భావిస్తున్నారు.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ

ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ

వీసాల నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు నిపుణులు అనేక మార్గాలు సూచిస్తున్నారని, వాటిని వైట్ హౌస్ పరిశీలిస్తోందని చెబుతున్నారు. హెచ్1బీ, సహా హెచ్2బీ, జే1, ఎల్1 వీసాలు కూడా నిలిపివేయాలనుకుంటున్న జాబితాలో ఉన్నాయని తెలుస్తోంది.

ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఇది సరికాదు

ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఇది సరికాదు

వీసాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారనే వార్తలపై అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో థామస్ డోనో ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా దెబ్బతో భారీగా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాల్సి ఉందని, ఇలాంటి తరుణంలో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల అవసరం మన వద్ద ఉన్న కంపెనీలకు అవసరమని పేర్కొంది. ఉద్యోగ, ఉపాధి వీసాలను రద్దు చేయడం లేదా నిలిపివేయడం వల్ల ఆమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్‌కు లేఖ రాశారు.

ఎవరికి నష్టం?

ఎవరికి నష్టం?

హెచ్1బీ వీసాలు నిలిపివేస్తే అమెరికా టెక్ దిగ్గజాలకే ఎక్కువగా నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. భారత ఐటీ సంస్థలు గత కొంతకాలంగా వర్క్ వీసాలపై ఆధారపడటం తగ్గించినందున, గూగుల్, ఆపిల్ వంటి టెక్ సంస్థలకు ఇబ్బంది అంటున్నారు. వీసాల నిలిపివేతపై నిర్ణయం తీసుకుంటే అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి రావొచ్చునని చెబుతున్నారు. హెచ్1బీ వీసాల వల్ల ఎక్కువగా లబ్ధిపొందేది ఇండియన్స్. దాదాపు ప్రతి ఏడా జారీ చేసే 85,000 వీసాల్లో మూడింట రెండొంతులు ఇండియన్స్ ఉంటారు. USCIS డేటా ప్రకారం 2016 నుండి 2019 మధ్య టాప్ టెన్ ఇండియన్ కంపెనీల ఈ వీసాలు 51 శాతం నుండి 24 శాతానికి పడిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+