H-1B visaలపై యూఎస్‌లో ఉన్న భారతీయులకు శుభవార్త.. సర్వేలో ఆశ్చర్యకర విషయాలు..

H-1B visa: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులతో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కోటి కలలతో అమెరికా వెళ్లిన చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే గడువులోగా మరో ఉద్యోగం సంపాదించకపోతే వారి వీసా గడువు ముగుస్తుంది. ఇది చాలా మంది టెక్కీలను ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఈ క్రమంలో ఒక శుభవార్త వచ్చింది.

పెరుగుతున్న డిమాండ్..

పెరుగుతున్న డిమాండ్..

కఠినమైన ఆర్థిక వాస్తవాలు ఉన్నప్పటికీ 2022 ప్రారంభంలో కంటే ఇప్పుడు విదేశీ ప్రతిభకు డిమాండ్ ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. 2023 మొదటి త్రైమాసికంలో 71 శాతం కంపెనీలు గత ఏడాది ఇదే సమయంలో కంటే ఎక్కువ మంది విదేశీ పౌరులను నియమించుకుంటున్నట్లు వెల్లడైంది. అసలు గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఇటీవల ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన H-1B కార్మికులను నియమించుకుని కంపెనీలు వారిని ఆదుకుంటున్నాయి.

మెజారిటీ వ్యాపారులు..

మెజారిటీ వ్యాపారులు..

ఎన్వోయ్ గ్లోబల్ ప్రచురించిన సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 89 శాతం మంది వేరే కంపెనీలు తొలగించిన విదేశీయులను తమ సంస్థల్లో నియమించుకుంటున్నాయి. ఈ సర్వే ఫిబ్రవరిలో నిర్వహించబడింది. వివిధ కంపెనీల్లో ఇమ్మిగ్రేషన్‌కు బాధ్యత వహించే హెచ్‌ఆర్ నిపుణుల నుంచి 443 ప్రతిస్పందనలను ఎన్వోయ్ పొందింది. చాలా కంపెనీలు మునుపటి తొలగింపుల వల్ల ప్రభావితమైన విదేశీ ప్రతిభను రిక్రూట్ చేసుకోవటం ద్వారా లాభపడ్డాయని వెల్లడైంది.

ఉద్యోగాల ఔట్ సోర్సింగ్..

ఉద్యోగాల ఔట్ సోర్సింగ్..

మునుపటి సంవత్సరాల మాదిరిగా అమెరికాలో విదేశీ ప్రతిభకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ.. ఇమిగ్రేషన్ విధానంలో ఉన్న అడ్డంకుల వల్ల యాజమాన్యాలు విదేశీ ఉద్యోగులను ఇతర దేశాలకు తరలించి వారిని ఔట్‌సోర్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక వెల్లడించింది. ఈ ప్రణాళిక కారణంగా కెనడా భారీగా లాభపడింది. ఇదే క్రమంలో మెక్సికో, యూకేలు సైతం అత్యధికంగా లాభపడిన దేశాలుగా నిలిచాయి. బయట దేశాల్లో తమ సంస్థను స్థాపించటంతో పాటు అమెరికా కంపెనీలు గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ కంపెనీ ఏర్పాటును అన్వేషిస్తున్నాయని సర్వే వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+