అమెరికా పౌరసత్వం అంత ఈజీకాదు. ఇది కష్టతరమైనదే కాకుండా ఖరీదైనదిగా మారుతోంది. అగ్రరాజ్యం సిటిజన్‌షిప్ కోసం కుబేరులైన భారతీయులు ఓ మార్గాన్ని కనుగొన్నారు.. అదే గ్రెనడా. గ్రెనడా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్ (CBI) కార్యక్రమం ద్వారా తక్కువ సమయంలోనే అమెరికా పౌరసత్వం పొందే మార్గాన్ని కనుగొన్న ధనిక భారతీయులు ఇప్పుడు గ్రెనడా వైపు చూస్తున్నారు.

ఇలా చేస్తే మూడు నెలల్లోనే అమెరికా పౌరసత్వం
గత మూడు నెలలుగా CBI ప్రోగ్రామ్‌కు ఆదరణ పెరుగుతోందట. గ్రెనడా CBI ప్రోగ్రామ్ కింద ఓ వీసా దరఖాస్తుదారు 2,20,000 డాలర్లను ఇన్వెస్ట్ చేయాలి. వీటిని ప్రభుత్వ ఆమోదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టాలి. అప్పుడు పౌరసత్వం పొందవచ్చు. ఈ కరెబియన్ దేశానికి అమెరికాతో E2 వీసా ఒప్పందం ఉంది. ఇక ఓ గ్రెనెడియన్ అమెరికాలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకొని, మూడు నెలల్లో దీనిని పొందవచ్చు.

ఈ2 వీసాతో...
E2 వీసా ఒప్పందం ప్రకారం ఓ వ్యక్తి కనీసం 1,50,000 పెట్టుబడి పెట్టడం, దేశంలో ఉండటం, వ్యాపారం చేసుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ రిపోర్ట్ ప్రకారం.. అభివృద్ధి, ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా 50 శాతానికి పైగా ఇన్వెస్ట్ చేయాలి.

లాంగ్ ప్రాసెస్ కానీ..
ఈ మార్గంలో అమెరికా సిటిజన్‌షిప్ ప్రాసెస్ కాస్త లాంగ్‌గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. EB-5 కార్యక్రమం కింద ఇదివరకు ఇమ్మిగ్రాంట్ ఇన్వెస్టర్ కనీసంగా 5,00,000 డాలర్లు ఇన్వెస్ట్ చేయాలి. టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా (TEA)లో ఇటీవల దానిని మార్చి 9,00,000 డాలర్లుగా చేశారు. Non-TEA అయితే గత ఏడాది నవంబర్ నెల నుండి 1 మిలియన్ డాలర్ల నుండి 1.8 మిలియన్ డాలర్లకు పెంచారు. ఇది EB-5 ప్రోగ్రాం పట్ల ఆసక్తి తగ్గిస్తోందని చెబుతున్నారు.

సమయం తక్కువ, పెట్టుబడి తక్కువ
ఇక్కడ మరో అంశం కూడా ఉంది. అమెరికా సిటిజన్‌షిప్ పొందేందుకు గ్రెనడా మాత్రమే తక్కువ ఖరీదైనది కాదు. ప్రాసెసింగ్ సమయం కూడా వేగంగా ఉంటుంది. కేవలం ప్రాసెస్ మాత్రమే పెద్దది. కానీ సమయం తక్కువ, ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ. గ్రెనడియన్ పౌరసత్వం కోసం 90 రోజులు, మరో 90 రోజులు E2 వీసాకు సరిపోతుంది.

అదనపు ప్రయోజనం...
గ్రెనడియన్ E2 వీసా మార్గంలో మరో ప్రయోజనం కూడా ఉంది. ఈ మార్గంలో వీసా హోల్డర్ తన జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా పని చేసేందుకు అమెరికా అనుమతిస్తుంది. 21 ఏళ్లలోపు డిపెండెంట్ పిల్లల్ని అనుమతిస్తుంది.

సైప్రస్ కూడా..
గ్రెనడా వంటి నిబంధనలు కలిగి ఉన్న మరో దేశం కూడా ఉంది. అదే సైప్రస్. అమెరికా పౌరసత్వం కోసం ఇప్పుడు ఈ దేశం కూడా మరో ఎంపికగా చాలామంది ధనిక భారతీయులకు మారింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications