అమెరికాలో McDonald's తాత్కాలికంగా ఆఫీసుల మూసివేత.. ఉద్యోగుల కోతకు పదును పెడుతూ..
McDonald's: ద్రవ్యోల్బణం సెగ రోజుకో కంపెనీని తాకుతోంది. తాజాగా అమెరికాకు చెందిన బర్గర్ చైన్ మెక్‌డొనాల్డ్స్ సైతం దీని బారిన పడింది. ఈ క్రమంలో కంపెనీ అమెరికాలోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా కంపెనీ తన కార్పొరేట్ ఉద్యోగులను తొలగించటానికి సిద్ధమౌతోందని అమెరికాకు చెందిన ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం నివేదించింది. ఈ క్రమంలో యూఎస్ ఉద్యోగులతో పాటు కొంత మంది అంతర్జీతీయ సిబ్బందిని సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుంచి పనిచేయాలంటూ కంపెనీ అంతర్గత ఈ-మెయిల్ ద్వారా ఇప్పటికే కోరింది. అయితే కంపెనీ ఎంత మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటుందనే విషయాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

ఏప్రిల్‌లో కంపెనీ సిబ్బందికి సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో మెక్‌డొనాల్డ్స్ తన ప్రధాన కార్యాలయంలో విక్రేతలు, ఇతర బయటి పార్టీలతో జరిగే అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని ఉద్యోగులను కోరినట్లు సమాచారం. కొత్త బిజినెస్ ప్లాన్‌లో భాగంగా కార్పొరేట్ సిబ్బంది స్థాయిలను సమీక్షిస్తామని ఫాస్ట్ ఫుడ్ చైన్ జనవరిలోనే తెలిపింది.
తాజా చర్య కంపెనీ గతంలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా వచ్చిందని తెలుస్తోంది. అయితే కంపెనీ దీని కారణంగా ఎవరిని తొలగిస్తుంది లేదా ఏ విభాగాల్లో ఉద్యోగులను పెంచుతుందనే విషయాలు ప్రస్తుతానికి ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ క్రమంలో మెక్‌డొనాల్డ్స్ సోమవారం నాటికి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications