Layoff News: ప్రపంచ వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక మందగమనం వంటి కారణాలు త్వరలో ఆర్థిక మాంద్యం వస్తుందనే సంకేతాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ప్రస్తుతం వ్యాపార ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఐటీ సేవల రంగంలోని కంపెనీలు లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి.
తాజాగా అమెరికాకు చెందిన టెక్ కంపెనీ Intuit భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలనే ప్లాన్ ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ సీఈవో ససన్ కూటర్సీ ఉద్యోగులకు లేఖ రాశారు. తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 10% మందిని తొలగిస్తామని తన ఓపెన్ లెటర్లో తెలిపారు. పొదుపు చర్యల వల్ల ఉద్యోగులను తొలగించలేదని షాక్ ఇస్తూ.. అదే స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమిస్తానని, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువగా ఉద్యోగాలిస్తామని చెప్పారు.

తన లేఖలో తొలగించబడుతున్న ఉద్యోగుల్లో దాదాపు 1000 మంది కంపెనీ ఆశించిన స్థాయిలో పని చేయలేదని అన్నారు. కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్యను 10 శాతం తగ్గిస్తానని కూడా చెప్పారు. అలాగే ఎడ్మంటన్, బోయిస్‌లోని తన స్వంత కార్యాలయాలను మూసివేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 1,800 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీకి 250 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. అలాగే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం వచ్చిందని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచంలోని ప్రతి రంగంలోనూ మార్పులను తీసుకొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఊహించలేని అనేక పనులను AI ఇప్పుడు చేస్తోంది. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను ఉపయోగించేందుకు సిద్ధంగా లేకుంటే మార్కెట్లో కంపెనీ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవటంలో విఫలమౌతుందని సీఈవో ససన్ కూటర్సీ అన్నారు.
కంపెనీ దాదాపు 40 సంవత్సరాలుగా విజయవంతంగా పనిచేస్తోందని.. దానిని విస్తరించడానికి ప్రస్తుతం ఏఐ ఆధారిత సాంకేతికతలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని సీఈవో ఉద్యోగులకు వెల్లడించారు. ఇది AI విప్లవానికి నాంది మాత్రమేనని రాబోయే కాలంలో పెద్ద మార్పులను చూడబోతున్నామని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications