IT News: భారత ఐటీ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను అధిక వేతనాలతో నియమించుకోవడంపై తీవ్ర వివాదాన్ని సృష్టించిన కాగ్నిజెంట్ సంస్థ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుతం చాలా మంది మార్కెట్లో వీటిని దేశీయ టెక్ కంపెనీలైన TCS, HCL, Wipro, Infosys సంస్థల ఫలితాలతో పోల్చి చూస్తున్నారు.
అమెరికా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ జూన్ త్రైమాసిక లాభం 22.2 శాతం పెరిగి 566 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 546 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇవి భారతీయ ఐటీ సేవల కంపెనీల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. జూన్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం 4.85 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 4.89 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ పనితీరు యాక్టివ్‌గా కొనసాగుతోంది.

కాగ్నిజెంట్ కంపెనీ చరిత్రను పరిశీలిస్తే.. వాస్తవానికి చెన్నైలో స్థాపించబడింది. అయితే తర్వాతి కాలంలో కంపెనీ తన వ్యాపార ప్రయోజనం కోసం కార్యకలాపాలను అమెరికా కేంద్రంగా మార్చేసింది. ప్రస్తుతం అమెరికన్ కంపెనీగా కొనసాగుతున్నప్పటికీ కాగ్నిజెంట్ భారతదేశంలోనే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ భవిష్యత్ అంచనాలను గమనిస్తే.. 2024లో 19.3 నుంచి 19.5 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ క్రమంలో జూన్ త్రైమాసికంలో మెుత్తం ఉద్యోగుల సంఖ్య 8100 తగ్గి 3,36,300కి పడిపోయిందని పేర్కొంది. అలాగే అట్రిషన్ రేటు గత ఏడాది ఇదే కాలంలో 19.9 శాతం నుంచి ప్రస్తుతం పరిశీలనలో ఉన్న త్రైమాసికంలో 13.6 శాతానికి చేరుకుంది.
కాగ్నిజెంట్ జూన్ త్రైమాసిక లాభం 22.2 శాతం పెరగటంతో దాని దేశీయ పోటీదారుల పరిస్థితి ఎలా ఉందనే కంప్యారిజెన్ పెరిగింది. ఈ క్రమంలో టీసీఎస్ జూన్ త్రైమాసిక లాభం రూ.12,040 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది ప్రాతిపదికన 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 20% పెరిగి రూ.4,257 కోట్లకు చేరుకోగా.. ఇన్ఫోసిస్ కేవలం 7.1% వృద్ధితో రూ.6,368 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో విప్రో ఏకీకృత నికర లాభం 4.6% వృద్ధితో రూ.3,003 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications