Finance Jobs: అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో ప్రస్తుతం జాబ్ మార్కెట్లో అనేక మార్పులు రాబోతున్నాయి. అనేక కంపెనీలు తమకు అవసరమైన నిపుణులను నేరుగా రిక్రూట్ చేసుకునేందుకు హెచ్1బి వీసాల పరిమితి ప్రభావాలు ఉన్నందున కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా సంస్థలు తమ అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల్లో ఆఫీసుల విస్తరణ ప్రణాళికతో ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ తన వ్యాపారాన్ని ఇండియా కేంద్రంగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సామర్థ్యాలను భారతదేశంలో విస్తరించాలని ప్లాన్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్ ఇందులో భాగంగా ముంబై, న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లలో తన iHub కేంద్రాల కోసం నియామకాలు చేపడుతోంది. ప్రస్తుత నియామకాలతో కంపెనీ భారతీయ ఉద్యోగుల సంఖ్య 3,500కి పెరుగుతుందని వెల్లడైంది.

ప్రస్తుతం కంపెనీ విస్తరణ కారణంగా ఎక్కువ మంది డేటా సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు కలిగి ఉంటారని వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ బెంగళూరు ఐటీ హబ్ లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ కోసం కూడా ఉద్యోగుల నియామకాన్ని కొనసాగిస్తోంది. బెంగళూరులో దాదాపు 1500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి రాయిటర్స్ నివేదికపై ఇప్పటి వరకు బ్లాక్‌రాక్ నేరుగా స్పందించలేదు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గురుగ్రామ్, ముంబై సపోర్ట్ సెంటర్ల కోసం కంపెనీ ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులను కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంబానీతో వ్యాపారం..
ముఖేష్ అంబానీ ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థతో ఇండియాలో పెట్టుబడుల వ్యాపారం కోసం ఇప్పటికే జతకట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జియో ఫైనాన్షియల్ రెండు కంపెనీల్లో 50% వాటా కోసం రూ.82.9 కోట్లు పెట్టుబడి పెట్టింది. అంటే జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ కోసం రూ.82.5 కోట్లు కాగా జియో బ్లాక్‌రాక్ ట్రస్టీకి రూ.40 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. భారతీయ రెగ్యులేటరీల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ రెండు కంపెనీలు మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ముందుకు సాగాలని నిర్ణయించాయి.
జియో బ్లాక్‌రాక్ సంస్థ అమెరికా దిగ్గజాన్ని పెట్టుబడి నిర్వహణ, రిస్క్ మేనేజ్మెంట్, సాంకేతికతలో నైపుణ్యాన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్థానిక మార్కెట్ పరిజ్ఞానం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో మిళితం చేస్తుంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications