గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి పట్టణ నిరుద్యోగిత రేటు 8.9 శాతం నుండి 8.4 శాతానికి తగ్గింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్(MoSPI) తన క్వార్టర్ బులిటెన్‌లో తెలిపింది. అర్బన్ నిరుద్యోగిత రేటు 15 ఏళ్ల నుండి 29 ఏళ్ల మధ్య 20.6 శాతంగా ఉంది. కేరళ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ నిరుద్యోగితరేటు దేశ సగటు కంటే ఎక్కువగా నమోదయింది. ఈ మేరకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడిస్తోంది.
పట్టణ నిరుద్యోగితరేటు 2018 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 9.7 శాతం ఉండగా, 2019 సెప్టెంబర్ క్వార్టర్ నాటికి భారీగా తగ్గింది. అంటే మూడు క్వార్టర్‌లలో క్రమంగా తగ్గింది. పట్టణ పురుషుల్లో (ట్రాన్స్‌జెండర్స్‌తో కలిపి) నిరుద్యోగిత రేటు 8 శాతంగా ఉండగా, స్త్రీల నిరుద్యోగిత రేటు 9.7 శాతంగా నమోదయింది.

2019 సెప్టెంబర్ 30 నాటికి 1.76 లక్షల మంది, 44,471 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1.79 లక్షల మంది, 45,288 హౌస్ హోల్డ్స్‌లో సర్వే నిర్వహించారు. జూన్ క్వార్టర్ నాటికి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 36.2 శాతం నుండి 36.8 శాతానికి పెరిగింది. అదే సమయంలో వర్కర్ పాపులేషన్ రేషియో 32.9 శాతం నుండి 33.7 శాతానికి పెరిగింది.


Click it and Unblock the Notifications