జనవరి 1 గేమ్ చెంజర్.. వాట్సాప్ నుండి అమెజాన్ వరకు ఈ రూల్స్ మార్పు..
నేటితో 2024 ఏడాది ముగుస్తుంది. ఇంకొన్ని గంటల్లో కొత్త ఏడాది జనవరి 1తో మొదలవుతుంది. అయితే రేపటి నుండి కొత్త ఏడాది మాత్రమే కాదు కొన్ని నిబంధనలలో కూడా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు ఎలా వస్తాయి ? అలాగే సామాన్యుడిపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది ? ఇప్పుడు చూద్దాం.. యుపిఐ, వాట్సాప్, అమెజాన్ ప్రైమ్ లో మారబోయే కొన్ని రూల్స్ గురించి మీకోసం. ఈ నిబంధనల మార్పు వల్ల కొన్ని పనులు ఈజీ అవుతాయి, అయితే కొన్ని నిబంధనల మార్పు వల్ల కాస్త కష్టం కూడా అవుతుంది.
యుపిఐ 123పే లిమిట్ పెంపు
యుపిఐ 123పే పరిమితిలో పెద్ద మార్పు చేసారు. ఇప్పుడు ఈ మార్పుతో యూజర్లు ఒకేసారి రూ. 10,000 ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కాగా ఇంతకుముందు ఈ లిమిట్ రూ.5 వేలుగా నిర్ణయించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నహాలు చేస్తూ అలాగే ఇప్పుడు యూజర్లకు మని ట్రాన్స్ఫర్ మరింత ఈజీ కాబోతోంది. మీరు ఈ పరిమితిని పాటించడం చాలా ముఖ్యం. UPI 123Pay అనేది ఇంటర్నెట్ సహాయం లేకుండా డబ్బును ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా చేయడానికి కస్టమర్ల మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఈ OTP సహాయంతో మని ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు
వాట్సాప్ పాత ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సపోర్ట్ నిలిపివేయబోతోంది. మెటా స్వయంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ లేదా పాత వెర్షన్‌లలో WhatsAppని ఉపయోగించలేరు. ఈ కారణంగా చాలా మంది ప్రజలలో ఆందోళన పెరిగింది. ఇది జరిగిన తర్వాత ప్రజలు ఇక వాట్సాప్లో ఏ కొత్త ఫీచర్‌ను ఉపయోగించలేరు. అంటే కస్టమర్లకు ఎలాంటి అప్‌డేట్ పొందలేరు. Samsung Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini పేర్లను కూడా ఇందులో పొందుపరిచారు. అంతే కాకుండా Moto Razor కొన్ని ఫోన్‌లు కూడా చేర్చారు. అంతే కాకుండా కొన్ని ఇతర డివైజ్ మోడల్స్ కూడా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ కొత్త రూల్
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యూజర్లకు 2 టీవీలకు మాత్రమే యాక్సెస్ అందించనుంది. ఒక యూజర్ ఒకటి కంటే ఎక్కువ టీవీలలో ప్రైమ్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే, అతను ప్రత్యేక సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు టీవీ యాక్సెస్ కూడా కంట్రోల్ చేయబడుతుంది. కంపెనీ ఈ కొత్త నిబంధన జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications