సింగపూర్ లో ఉన్న భారతీయులకు శుభవార్త అందింది. సింగపూర్ లో ఉన్న భారతీయులు ఇండియాలో ఉన్న తమ వారికి డబ్బులు సింపుల్ పంపొచ్చు. యూపీఐ పేమెంట్స్ ద్వారా భారత్ కు డబ్బులు పంపవచ్చు. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పలు చర్యలు తీసుకుంది. సింగపూర్ నుంచి నేరుగా ఇక్కడి వారి బ్యాంక్ ఖాతాల్లోకి నిధులను, కోరుకున్న వెంటనే బదిలీ చేసేందుకు యూపీఐ పేనౌ ద్వారా వీలు కల్పించామని ఎన్‌పీసీఐ పేర్కొంది.
ఈ సేవ ఏడాదిలో అన్ని రోజుల్లోనూ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని ఎన్పీసీఐ చెప్పింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ప్రధాన యాప్‌లైన భీమ్, ఫోన్‌పే, పేటీఎంలతో పాటు ఎస్‌బీఐ, యాక్సిస్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ వంటి బ్యాంకుల యాప్‌ల ద్వారా డబ్బులు పంపొచ్చని వివరించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సింగపూర్ మానిటరీ అథారిటీ (MAS) సంయుక్త ప్రయత్నాల తర్వాత ఇది సాధ్యమైంది.

సింగపూర్‌కు చెందిన భారతీయ ప్రవాసుల నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి భారతీయులు రెమిటెన్స్‌లను స్వీకరించవచ్చు. సమీప భవిష్యత్తులో అనేక థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌లు (TPAPలు) అలాగే బ్యాంక్ యాప్‌లు డబ్బులు పంపే అవకాశం కల్పించనున్నారు. వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యుకో బ్యాంక్ ఉన్నాయి.
యూపీఐ పేమెంట్స్ తో ఫండ్‌లు నిజ సమయంలో బదిలీ అవుతాయి. క్షణాల్లో గ్రహీత బ్యాంక్ ఖాతాకు చేరుతాయి. సురక్షితమైన, విశ్వసనీయ లావాదేవీలను నిర్ధారించడానికి అనుసంధానం బలమైన భద్రతా ప్రోటోకాల్‌లను పాటించవచ్చు. లావాదేవీ రుసుములు తక్కువగా ఉంటాయి.


Click it and Unblock the Notifications