రెండేళ్లలో 60 శాతం పెరిగిన సేవల రంగం.. కేంద్ర మంత్రి Piyush Goyal ఏమన్నారంటే..

Service Sector: గత రెండేళ్లలో భారత సేవల రంగం మంచి పనితీరును నమోదు చేసింది. కరోనా సమయంలో అన్నీ స్తంభించినప్పటికీ సర్వీస్ సెక్టార్ లోని కంపెనీలు మాత్రం మంచి వృద్ధిని నమోదు చేశాయి.

భారత సేవల రంగం పనితీరుపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. సర్వీస్ సెక్టార్ ఏకంగా 60 శాతానికి పైగా వృద్ధి చెందిందని ఆయన వెల్లడించారు. 2021లో ఈ రంగం 206 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది. 2022లో ఇది 320 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయని పేర్కొన్నారు. వాణిజ్య పరంగా గరిష్ఠ వృద్ధిని నమోదు చేసింది.

Union Minister Piyush Goyal spoke over indian service sector whopping gowth

2020-21లో భారత్ నుంచి సేవల మొత్తం ఎగుమతులు 206 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2021-22లో 250 బిలియన్ డాలర్లను చేరుకోగా.. 2022-23లో ఇది 325 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. అయితే 2022-23 వాస్తవ గణాంకాలు ఇంకా వెల్లడికాలేదు. ఇదిలా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం వాణిజ్యంలో 400 బిలియన్ డాలర్లకు పైగా వృద్ధి చెందుతుందని ట్రేడింగ్ పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ అభయ్ సిన్హా సేవా రంగం ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మార్కును దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్కును చేరుకునేందుకు వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, FDI నిబంధనలను సడలించడం, నియంత్రణ సడలింపు వంటి అంశాల్లో కొనసాగుతున్న మార్పులు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వృద్ధి రేటు నమోదుకు సిద్ధంగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+