Indian Economy: 40 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్.. ఎప్పటి కంటే..
Indian Economy: రానున్న నాలుగైదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్రానికి నూరేళ్లు..
దేశ ఆర్థిక వృద్ధి రేటు 2047 నాటికి 35-40 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అన్నారు. అంటే భారత్ స్వాతంత్య్రం వచ్చి అప్పటికి సరిగ్గా 100 ఏళ్లు నిండుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదని, రాబోయే అనేక దశాబ్దాలు ఇలాగే కొనసాగుతుందని ఆసియా ఎకనామిక్ డైలాగ్‌లో గోయల్ అన్నారు.
సంస్కరణలు..
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మంత్రి గోయల్ వెల్లడించారు. దీంతో ఇప్పుడు భారతదేశం 21వ శతాబ్దపు దేశంగా కాకపోయినా దశాబ్దపు దేశంగా స్పష్టంగా పరిగణించబడుతుందని అన్నారు. దేశం బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలను కలిగి ఉందని తెలిపారు. ఈ క్రమంలో భారత్ ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి 5వ స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. పైగా యువ జనాభా అధికంగా ఉండటం అతిపెద్ద ఆస్తి అని ఆయన తెలిపారు.

ప్రపంచ సవాళ్లు..
అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాలపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపిందని గోయల్ వెల్లడించారు. అయితే ఆహారం, ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందన్నారు. ఇది అగ్రరాజ్యాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలనూ నాశంన చేసిందని ఆయన చెప్పారు. RCEPలో చేరడానికి గత ప్రభుత్వం తీసుకున్న చర్య అవివేకమనదని దానివల్ల చైనా నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని వస్తువులకు మన ప్రజలను అలవాటు చేయడం ద్వారా భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని గోయల్ పేర్కొన్నారు.

వాణిజ్య లోటు..
15-16 సంవత్సరాల కిందట చైనాతో భారత వాణిజ్య లోటు దాదాపు 2 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది. అయితే ఇది 2014 నాటికి దాదాపు 48 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆటో పరిశ్రమలో 100 శాతం స్వదేశీకరణ, MSMEలను మరింత లాభదాయకంగా మార్చడం, హరిత వ్యాపారాలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పు, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications