Bank Jobs: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందేందుకు అనేక మంది యువత కలలు కంటుంటారు. బ్యాంకులు ఖాళీల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తాయా అని కోటి ఆశలతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పబోతోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ప్రతినెలా రిక్రూట్‌మెంట్..
ఈ సమావేశంలో బ్యాంకుల్లోని ఉద్యోగుల సంఖ్యను సమీక్షించి.. నెలవారీ రిక్రూట్ మెంట్ ప్లాన్ తీసుకురానున్నట్లు సమాచారం. గడచిన 10 సంవత్సరాల్లో బ్యాంకుల సంఖ్య 28 శాతం పెరిగినప్పటికీ ఉద్యోగుల సంఖ్య మాత్రం అంత వేగంగా పెరగలేదు. బ్యాంక్ బ్రాంచ్ ల స్థాయిలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.

గ్రామాల్లో అధిక డిమాండ్..
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎక్కువ శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం, వాటికి అనేక పనులపై ప్రజలు నేరుగా రావటం మనం చూస్తూనే ఉంటాం. పట్టణ ప్రాంతాల్లో కూడా ఫిజికల్ గా బ్యాంకులకు వెళ్తుంటారు. సైబర్ మోసాల కారణంగా చాలా మంది ఇప్పుడు నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు పూర్తి చేసుకునేందుకే ఇష్టపడటం బాగా పెరగటం వల్ల కూడా సిబ్బంది అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా క్లరికల్ స్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.

పెరిగిన శాఖలు.. తగ్గిన సిబ్బంది..
గత పదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల సంఖ్య 28 శాతం పెరగగా.. సిబ్బంది సంఖ్య మాత్రం తగ్గింది. డిజిటలైజేషన్ పెరగటంతో క్లెరికల్ సిబ్బంది సంఖ్యను తగ్గించడానికి దారితీసింది. మార్చి 2021 నాటికి దేశవ్యాప్తంగా 86,311 శాఖలు ఉండగా.. 1.4 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం 2010-11లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 7.76 లక్షలు కాగా, అది 2020-21 నాటికి 7.71 లక్షలకు తగ్గింది. దీనికి క్లర్క్‌లు, జూనియర్ సిబ్బంది నియామకాలు తగ్గటం కూడా కారణంగా నిలుస్తోంది.

10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు..
ఉపాధి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న తరుణంలో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంటోంది. డిసెంబర్ 2023 నాటికి 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థానిక భాషపై అవగాహన ఉన్న వ్యక్తులకు బ్యాంకుల్లో ముందు డెస్క్‌ను నిర్వహించే బాధ్యత ఇవ్వాలని అన్నారు. ఈ క్రమంలో కొత్త కొలువులపై యువత ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications