Credit Card: ప్రస్తుత కాలంలో బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు లేని వారు లేరనటం అతిశయోక్తి కాదు. అత్యవసర సమయాల్లో అవసరం కోసం జాగ్రత్తగా వాడుకునే క్రమశిక్షణ కలిగిన వ్యక్తులకు ఇవి మంచి సౌకర్యం.
అయితే క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో దీని వినియోగంపై పలు అనుమానాలు ఉన్నాయి. కార్డు వినియోగించటం వల్ల వచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్స్ పై ఆదాయపు పన్ను ఉంటుందా అని అనుమానాలు ఉన్నాయి. చాలా ఫైనాన్స్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొనుగోళ్లపై తక్షణ తగ్గింపులు, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత మెంబర్‌షిప్స్ లాంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి.

అయితే క్రెడిట్ కార్డ్ వినియోగం ద్వారా పొందే రివార్డులపై పన్ను విధించబడుతుందని యూజర్లు గమనించాలి. వాటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్(ఇతర ఆదాయం) కింద వర్గీకరించబడతాయని గుర్తుంచుకోండి. ఎవరైనా కార్డు హోల్డర్ ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం క్యాష్‌బ్యాక్ రూ.50,000 దాటి పొందినట్లయితే అది పన్ను పరిధిలోకి వస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డ్ కంపెనీలు సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రివార్డ్‌లు లేదా రూ.5,000 కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లపై 10 శాతం చొప్పున TDSని మినహాయించుకుంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తగ్గింపులు మరియు మినహాయింపులను క్లెయిమ్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లపై పన్ను బాధ్యతను తగ్గించుకోవచ్చు.

రానున్న కాలంలో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లద్వారా పొందే క్యాష్‌బ్యాక్‌పై ప్రభుత్వం కత్తెర వేసేందుకు జీఎస్టీని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. గతంలో కార్డు ఛార్జీలు, ఫీజుపై మాత్రమే జీఎస్టీ ఉండేది. చెల్లించాల్సిన మెుత్తంపై మాత్రం వర్తించేది కాదు. కానీ ప్రస్తుతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను మార్కెటింగ్ బ్రాండింగ్ సర్వీస్ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. దీనికి అనుగుణంగా జీఎస్టీ పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications