GST News: కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోని చిన్న ఆదాయ వర్గాలను సైతం టాక్స్ కిందకు తెచ్చేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోందని వెల్లడైంది.
ఇటీవల జీఎస్టీ రాయితీలను పొందటంలో కొంత మంది అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ ధోరణిని ఎలాగైనా అంతం చేయాలని చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నారు. వస్తువులు & సేవల పన్ను నెట్‌వర్క్ (GSTN)ని మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA) పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజా చర్య ద్వారా జీఎస్టీ కోసం సేకరించిన సమాచారాన్ని మనీలాండరింగ్ చట్టాల కింద పంచుకునేందకు వెసులుబాటు దొరికింది. తద్వారా పన్ను ఎగవేత, డాక్యుమెంట్లను తారుమారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కలగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై PMLA చట్టం కింద GST నెట్‌వర్క్ సమాచారాన్ని పొందవచ్చు.
దీని కారణంగా జీఎస్టీ కింద నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, నకిలీ ఇన్‌వాయిస్‌లు మొదలైన నేరాలు PMLA చట్టం కిందకు రానున్నాయి. తాజా చర్యతో కఠినమైన మనీలాండరింగ్ చట్టాల కింద జీఎస్టీ మోసాలకు పాల్పడేవారు తీవ్రమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
చిన్న వ్యాపారుల కోసం జీఎస్టీఎన్ కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తెస్తోంది. ఇందులో వారు తమ అకౌంట్స్ నిర్వహించుకోవచ్చు. పైగా దానిని నెల చివరిలో జీఎస్టీ రిటర్న్ మాదిరిగా నేరుగా ఫైల్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications