Income Tax: మరికొద్ది రోజుల్లో కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో అందరి ఆశలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో ఏ ప్రకటనలు చేస్తారా అని చూస్తున్నారు. ఈ సారి బడ్జెట్ ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా కీలకం ఎందుకంటే అది సరిగ్గా ఎన్నికలకు ముందు వస్తోంది కాబట్టి. అందుకే ఇదే సరైన సమయంగా భావించిన కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ కీలక ప్రకటన చేసింది.
చివరి బడ్జెట్ ముందు..
2024లో ఎన్నికలు ఉన్నందున ఇదే చివరి పూర్తి వార్షిక బడ్జెట్ కాబట్టి.. గత బడ్జెట్ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఒక హామీని తాజాగా నెరవేర్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం- 1961లో కొత్త సెక్షన్ 194Pని చేర్చింది. దీనికి తోడు రూల్- 31, రూల్- 31ఎ, ఫారం- 16, 24క్యూలలో అవసరమైన సవరణలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

ఎవరికి ప్రయోజనం..
2022 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు నుంచి వృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. తాజాగా దానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు తెచ్చింది. ఈ మార్పుల ప్రకారం.. దేశంలో 75 ఏళ్లు పైబడిన వారు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.

షరతులకు లోబడి..
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఇచ్చిన వెసులుబాటు అర్హులకు మాత్రమే. అదేంటంటే.. ప్రభుత్వ ప్రకటన ప్రకారం బ్యాంకు నుంచి పెన్షన్ లేదా వడ్డీని మాత్రమే ఆదాయ వనరుగా కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లు దీని కింద ప్రయోజనం పొందుతారు. వారు ఈ ఏడాది నుంచి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉండగా చాలా మంది 2023లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా టాక్స్ శ్లాబ్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కీలక ప్రకటన గురించి వారు వేచిచూస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications