న్యూఢిల్లీ: దాదాపు సగం మంది పట్టణవాసులు దేశంలోని నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం భారత్ సరైన దిశలో వెళ్తోందని వారు అభిప్రాయపడ్డారు. ఏకంగా 69 శాతం మంది అర్బన్ ఇండియన్స్ ఇండియా రైట్ డైరెక్షన్‌లో వెళ్తోందని చెబుతున్నారు. తద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం భావి భారత నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నంగా చాలామంది భావిస్తున్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఇప్పోస్ తాజా సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

నిరుద్యోగం అసలు సమస్య
నిరుద్యోగ సమస్యపై దాదాపు సగం మంది ఆందోళనతో ఉన్నారు. దీంతో పాటు భారతీయులకు ఆందోళన కలిగిస్తున్న ఇతర అంశాల్లో ఆర్థిక అవినీతి, పొలిటికల్ కరప్షన్, నేరాలు, హింస, పేదరికం, అసమానతల, వాతావరణ మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని, అలాగే భారత్‌ను కలవరపెడుతున్న అంశాలపై ఇప్పోస్ ఈ సర్వే నిర్వహించింది.

భారత్ సరైన దారిలోనే వెళ్తోందని 69 శాతం మంది
ఓ వైపు నిరుద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, భారత్ మాత్రం సరైన దిశలో ముందుకు సాగుతోందని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. 69 శాతం మంది అర్బన్ ఇండియన్స్ భారత్ సరైన దారిలో వెళ్తోందని చెప్పగా, ప్రపంచంలో ఇది కేవలం 61 శాతం మాత్రమే. అంటే అన్ని దేశాలతో పోలిస్తే ఇండియాలోనే 8 శాతం మంది ఎక్కువగా అద్భుతమైన భావి భారత్ దిశగా వెళ్తోందని అభిప్రాయపడ్డారు.

నిరుద్యోగంపై 46 శాతం మంది ఆందోళన
నిరుద్యోగం ఆందోళన కలిగించే అంశమని 46 శాతం మంది చెప్పారు. ఈ సర్వేను అక్టోబర్ నెలలో నిర్వహించారు. నవంబర్ నెలలో నిరుద్యోగం మరో 3 శాతం పెరిగింది. నిరుద్యోగంతో పాటు పేదరికం, సామాజిక అసమానతలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక అసమానత, పేదరికం ఆందోళనకరం
28 దేశాల్లో ఇప్సోస్ ఆన్ లైన్ ప్యానెల్ సిస్టం ద్వారా సర్వే నిర్వహించింది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేదరికం, సామాజిక అసమానతలే ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఆ తర్వాత నిరుద్యోగం, నేరాలు, హింస, రాజకీయ, ఆర్థిక కరప్షన్, హెల్త్ కేర్ ఉన్నాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications