సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం సెప్టెంబర్ - డిసెంబర్ క్వార్టర్‌లో భారత్‌లో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగింది. విద్యావంతులైన యువతలో నిరుద్యోగ రేటు 60 శాతంగా ఉంది. తద్వారా 2019 యువ గ్రాడ్యుయేట్లకు అత్యంత వరస్ట్ ఏడాది అని అర్థమవుతోంది.

అర్బన్ ఇండియా నిరుద్యోగ రేటే ఎక్కువ
మే - ఆగస్ట్ 2017లో నిరుద్యోగ రేటు 3.8 శాతంగా నమోదయిందని, నాటి నుంచి ఈ రేటు వరుసగా పెరుగుతోందని, నిరుద్యోగం పెరగడం ఇది వరుసగా ఏడో క్వార్టర్ అని CMIE తెలిపింది. 1,74,405 హౌస్ హోల్డ్స్ నుంచి CMIE సర్వే చేసింది. అర్బన్ ఇండియా కంటే రూరల్ ఇండియాలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. జాతీయ సగటు కంటే అర్బన్ ఇండియా నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది.

గ్రామీణంలో తక్కువే కానీ
సెప్టెంబర్ - డిసెంబర్ క్వార్టర్‌లో రూరల్ ఇండియా నిరుద్యోగ రేటు 6.8 శాతంగా ఉంది. అయితే గ్రామీణ భారతం ఎక్కువ కాబట్టి రూరల్ ఇండియాలో మొత్తం నిరుద్యోగ రేటు 66 శాతంగా ఉంది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత రేటు తక్కువ కలిగి ఉందని, కానీ ఇక్కడి ఉపాధి నాణ్యత లేనిదని CMIE పేర్కొంది.

గ్రాడ్యుయేట్లకు రోజు రోజుకు తగ్గుతున్న ఉద్యోగాలు!
పట్టణ యువతలో ముఖ్యంగా విద్యావంతులైన యువతలో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 20-24 వయస్సు యువతలో నిరుద్యోగ రేటు 37 శాతం ఉంది. ఇందులో గ్రాడ్యుయేట్లది 60 శాతానికి పైగా ఉంది. 2019లో వారి సగటు నిరుద్యోగిత రేటు 63.4 శాతంగా ఉంది. గత మూడేళ్లలో వీరిలో ఇదే అధికం. 2016లో 47.1 శాతం, 2017లో 42 శాతం, 2018లో 55.1 శాతంగా ఉంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు అంతే
పోస్ట్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు కూడా ఎక్కువే ఉంది. 2016లో 24.6 శాతం 2017లో 25.4 శాతం, 2018లో 22.3 శాతం కాగా, 2019లో 23 శాతంగా ఉంది. 20-24 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి ఉపాధి అవకాశాలు అంతగా లేవని నివేదిక తెలిపింది. నిరుద్యోగిత రేటు 2017 మే - ఆగస్ట్ మధ్య 17 శాతం ఉండగా 2019 సెప్టెంబర్ - డిసెంబర్ నాటికి 37 శాతానికి చేరుకుంది. 15-19 ఏళ్ల మధ్య వయస్సు వారి నిరుద్యోగ రేటు 45 శాతంగా ఉంది. గ్రాడ్యుయేట్లలో ప్రతి నలుగురిలో దాదాపు ఒకరు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు.

30 ఏళ్ల వయసు దాటిన వారి నిరుద్యోగిత రేటు
30 - 34 ఏళ్ల మధ్య వారి నిరుద్యోగిత రేటు 2.5 శాతానికి పడిపోయింది. భారత్‌లో నిరుద్యోగిత రేటు 2019 డిసెంబర్‌లో 7.7 శాతానికి పెరిగిందని, నవంబర్ నెలలో 7.48 శాతంగా ఉందని నివేదిక చెబుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications