రష్యా యుద్ధం దెబ్బ: 30 ఏళ్లుగా పడుతూ లేస్తూ... ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి ఏమిటి?

ఉక్రెయిన్ పైన రష్యా బాంబు దాడి మోగించింది. ఉక్రెయిన్ పైన ఆధిపత్యం కోసం మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది రష్యా. ఇందులో భాగంగా తాజాగా రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తించి యుద్ధానికి తెరలేపింది. 1991లో సోవియట్ రిపబ్లికన్ ఆఫ్ ఉక్రెయిన్.. రష్యా నుండి స్వాతంత్ర్యం పొందింది. అయితే అప్పటి నుండి ఉక్రెయిన్ లేదా పాశ్చాత్య అనుకూల, రష్యా అనుకూల ప్రతినిధులతో కొట్టుమిట్టాడుతోంది.

ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌ను రష్యా మూడు ముక్కలు చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో రష్యా కంటే ఉక్రెయిన్ ఆర్థికంగా, బలగం పరంగా, సైన్యం పరంగా ఎలా చూసినా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితిని చూద్దాం...

పడిలేచిన ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ

పడిలేచిన ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ

ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ఫ్రీ-మార్కెట్ ఎకానమీ. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ముందు అంటే 2000 నుండి 2008 వరకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగింది. 2008 నుండి 2009 మధ్య ప్రపంచ దేశాలతో పాటు ఉక్రెయిన్ కూడా దెబ్బతిన్నది. అయితే 2010 నుండి తిరిగి కోలుకున్నది. 2013 వరకు దూకుడు కొనసాగించింది. 2014-2015 సమయంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. 2015లో ఆ దేశ జీడీపీ ఎంత ఉందంటే 2013 జీడీపీలో సగం కంటే కాస్త ఎక్కువ మాత్రమే. అయితే 2016లో తిరిగి కోలుకోవడం ప్రారంభమైంది. 2018 నాటికి అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేసిన దేశంగా కనిపించింది. 2008 నాటి జీడీపీతో పోలిస్తే 80 శాతానికి చేరుకుంది.

పడిలేస్తూ.... దెబ్బమీద దెబ్బ

పడిలేస్తూ.... దెబ్బమీద దెబ్బ

1990వ దశకంలో ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉంది. జీడీపీ వృద్ధి 2000 సంవత్సరంలో మొదటిసారి నమోదయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వరుసగా ఎనిమిదేళ్ల పాటు (2008) వృద్ధి పరుగు పెట్టింది. 2008-09లో ప్రపంచ సంక్షోభం కారణంగా ఆగిపోయింది. గొప్ప వ్యవసాయ భూములు, అభివృద్ధి చెందిన పారిశ్రామికం, అధిక శిక్షణ పొందిన కార్మికులు, మంచి విద్యావ్యవస్థను కలిగి ఉంది.

2010లో తిరిగి కోలుకున్నప్పటికీ 2013లో మళ్లీ సంక్షోభంలోకి వెళ్లింది. యూరోప్ దేశాల్లో ఉక్రెయిన్ జీడీపీ తలసరి తక్కువగా ఉంది. 2019లో వృద్ధి రేటు 3.2 శాతంగా నమోదయినట్లు వరల్డ్ బ్యాంకు ఏప్రిల్ 2020 నివేదిక వెల్లడించింది. ఆర్థిక వృద్ధి పటిష్టతకు ప్రధాన కారణాలు మంచి వ్యవసాయ పంట, దేశీయ వినియోగంపై ఆధారపడటమే కారణంగా పేర్కొంది. రెమిటెన్స్ ఇన్-ఫ్లో కూడా భారీగా పెరిగింది. 2019లో గృహ వినియోగం 11.9 శాతం పెరిగింది. అయితే కోవిడ్ కారణంగా 2020లో జీడీపీ 4.4 శాతం క్షీణించింది. ఇప్పుడు రష్యా కారణంగా మరోసారి తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్థికంగా దెబ్బ

ఆర్థికంగా దెబ్బ

రష్యా ఇటీవల ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. దీంతో యుద్ధం ప్రారంభానికి ముందే వాణిజ్యం దెబ్బతిన్నది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయు. ఆ దేశంలోను ఏం జరుగుతుందో అనే టెన్షన్‌తో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా క్షీణిస్తోంది. రష్యా దూకుడు ఉక్రెయిన్‌ను ఆర్థికంగా దారుణంగా దెబ్బతీస్తుంది. ప్రపంచంలోని టాప్ గ్రెయిన్ ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ఒకటి. ప్రపంచ గోధుమ సరఫరాలో 12 శాతం, మొక్కజొన్నలో 16 శాతం ఉంది. భారత్‌కు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి చేస్తుంది.

క్షీణిస్తున్న కరెన్సీ

క్షీణిస్తున్న కరెన్సీ

జనవరిలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్ జాతీయ కరెన్సీ హైవ్నియా వ్యాల్యూను కోల్పోవడం ప్రారంభించింది. రెండు విడిపోయిన ప్రాంతాలను రష్యా గుర్తించిన అనంతరం ఈ కరెన్సీ మంగళవారం మరింత పడిపోయింది. ఇప్పుడు అంతకంతకూ క్షీణిస్తోంది. కైవ్ (ఉక్రెయిన్) ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని రష్యన్ ఆర్టీ న్యూస్ నెట్ వర్క్ అధినేత వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+