Layoffs: బట్టతల ఉందంటూ ఉద్యోగం నుంచి తొలగింపు.. చివరికి మెగా ట్విస్ట్.. ఏమైందంటే..
Layoffs: ప్రస్తుతం కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. సహజంగా కంపెనీలు ఉద్యోగి పనితీరు ఆదారంగా అతడిని కొనసాగించాలా లేక తొలగించాలా అనేది నిర్ణయిస్తుంటాయి. కానీ ఒక వ్యక్తి విషయంలో అలా అస్సలు జరగలేదు.

బట్టతల ఉందంటూ..
యూకేకు చెందిన ఒక వ్యక్తి బట్టతల కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఈ సంఘటన ఇంగ్లండ్‌లోని లింగో నెట్‌వర్క్స్ లిమిటెడ్ అనే కంపెనీలో జరిగింది. వింటానికి ఇది కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. ఇది వాస్తవం. అయితే ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఈ వ్యక్తికి పెద్ద అదృష్టం తగిలిందనే చెప్పుకోవాలి. కంపెనీలో 50 ఏళ్లు పైబడిన బట్టతల ఉన్నవారు పనిచేయకూడదంటూ మేనేజర్ వారిని బయటకు బలవంతంగా పంపేశారు. దీంతో చాలా మంది ఉద్యోగుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

కోర్టుకెళ్లిన వ్యక్తి..
లింగో నెట్‌వర్క్స్ లిమిటెడ్ అమానుషంగా వ్యవహరించటంపై తొలగించబడిన ఉద్యోగుల్లో ఒకరైన మార్జ్ జోన్స్ ఈ వ్యవహారం విషయంలో కోర్టును ఆశ్రయించారు. తల నిండుగా జుట్టు ఉన్నప్పటికీ తనను తప్పుగా తొలగించారని అతడు కోర్టుకు తెలిపాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన అక్కడి కోర్టు సదరు ఉద్యోగికి కంపెనీ రూ.71 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

కంపెనీ నిర్ణయం..
కంపెనీలో యువత ఉంటే పని వేగంగా జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వంకతో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగులను తొలగించటానికి ఇలాంటి అసంబద్ధమైన కారణాలను చూపుతున్నాయి. వారిని బలవంతంగా ఉద్యోగం నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అలాంటి కంపెనీలకు యూకే కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద గుణపాఠమని చాలా మంది భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications