రైడ్ హెయిలింగ్ ఉబెర్ ఇండియాలో 600 మంది ఉద్యోగులను తొలగించింది. దేశంలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో దాదాపు నాలుగో వంతు మందిని తొలగించింది. వివిధ స్థాయిల్లో, టీమ్‌లలో వీరిని తొలగించినట్లు ఉబెర్ తెలిపింది. ఓలా ఇప్పటికే 1400 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో, ప్రయాణ ఆంక్షలు ఉండటంతో వివిధ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి.

ఈ డివిజన్లలో తొలగింపు
కస్టమర్ సపోర్ట్, డ్రైవర్ సపోర్ట్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్, లీగల్, పాలసీ, మార్కెటింగ్ సహా వివిధ డివిజన్లలో దేశంలో దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ తెలిపింది. తొలగించిన ప్రతి ఒక్కరికి పదివారాల వేతనం, రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సురెన్స్ కవరేజ్, అవుట్ ప్లేస్‌మెంట్ సపోర్ట్, ఉబెర్ టాలెంట్ డైరెక్టరీలో చేరే అవకాశం, ల్యాప్‌టాప్ వాడకానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు ఉబెర్ ఇండియా, దక్షిణాసియచా అధ్యక్షులు ప్రదీప్ పరమేశ్వరన్ తెలిపారు.

తప్పనిసరి పరిస్థితుల్లో..
కరోనా కారణంగా వ్యాపారం లేకుండా పోయిందని, ఇది అనూహ్య పరిణామమని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని ఉబెర్ ఇండియా తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయవ్యాప్తంగా ఉద్యోగాల కోతపై చేసిన ప్రకటనకు అనుగుణంగా దశలవారీగా ఈ ఉద్యోగాలకోత చోటు చేసుకుంటుందని ఉబెర్ తెలిపింది.

ఇది బాధాకరం.. నన్ను క్షమించండి
ఉద్యోగుల తొలగింత చాలా బాధాకరమని, ఉబెర్ ఫ్యామిలీని విడిచి వెళ్తున్న ఉద్యోగులకు, సంస్థలోని మా అందరికీ ఇది చాలా విచారకరమైన రోజు అని, తొలగించబడిన ఉద్యోగులకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని, ఉబెర్ కంపెనీకి వారు చేసిన సేవలకు తాను హృదయ పూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని, తమ ఉద్యోగులతో కలిసి తాము ఇండియాలో సేవలు అందిస్తున్నామని పరమేశ్వరన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మే మొదటి వారంలో ఉబెర్ ప్రకటించింది.

వరుసగా ఉద్యోగుల తొలగింత
కరోనా కారణంగా మార్చి 25వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు వివిధ స్టార్టప్స్ వేలాది మందిని ఉద్యోగం నుండి తొలగించాయి. ఓయో 5,000 మంది, ఉడాన్ 3,000 మంది, ఓలా 1400 మంది, స్విగ్గీ 1100 మంది, క్యూర్ ఫిట్ 800 మంది, పేటీఎం 700 మంది, ఉబెర్ ఇండియా 600 మంది, జొమాటో 520 మంది, లివ్ స్పేస్ 450 మంది, లెండింగ్ కార్ట్ 200 మంది, షేర్ చాట్ 101 మంది ఉద్యోగులను తొలగించింది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications