For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు, అక్కడ మళ్లీ 1,900 డాలర్లకు..

|

రెండు రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం, వెండి ధర ఈరోజు(సెప్టెంబర్ 30, బుధవారం) తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు క్షీణించడంతో ఇక్కడా ప్రభావం పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రం సెషన్ సమయానికి 10 గ్రాముల గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.8 శాతం క్షీణించి రూ.50,249కు పడిపోయింది. ఈవారంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. క్రితం సెషన్‌లో రూ.50వేల మార్క్ దాటింది. ఆగస్ట్ 7వ తేదీన రూ.56,200తో ఆల్ టైమ్ హైకి చేరుకున్న పసిడి ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ గరిష్ట ధర నుండి దాదాపు రూ.6,000 తక్కువ ఉంది.

భారీగా తగ్గిన ధరలు...

భారీగా తగ్గిన ధరలు...

పసిడి ధరలు ఈ రోజు రూ.400కు పైగా తగ్గి రూ.50,249కి చేరుకుంటే, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 2.8 శాతం లేదా రూ.1,700కు పైగా క్షీణించి కిలో రూ.60,700 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి రూ.500 పెరిగింది. వెండి కిలో రూ.1,900 వరకు ఎగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు అస్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాతం క్షీణించి ఔన్స్ 1,896.03 డాలర్లు పలికింది. సిల్వర్ మాత్రం 0.2 శాతం ఎగిసి ఔన్స్ 24.22 డాలర్లు పలికింది. ప్లాటినమ్ ధర 0. శాతం క్షీణించి 883.25 డాలర్లు, పల్లాడియం 0.5 శాతం లాభపడి 2,319.59 డాలర్లు పలికింది.

ఫ్యూచర్ మార్కెట్లో..

ఫ్యూచర్ మార్కెట్లో..

బుధవారం ప్రారంభంలో పసిడి ధర ఔన్స్ భారీగా పడిపోయింది. ఓ సమయంలో కొనుగోలుదారులు రంగంలోకి దిగడంతో 1900 డాలర్లకు కూడా పెరిగింది. అయితే డాలర్ వ్యాల్యూ మళ్లీ కోలుకునే పరిస్థితి ఉందని, అప్పుడు పసిడి ధర మరింతగా క్షీణించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాలో అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరి మధ్య డిబెట్ సందర్భంగా పసిడి ధరలు నిన్న పెరిగాయి.

నేడు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ట్రాయ్ ఔన్స్ మద్దతు ధర 1,884-1,874 డాలర్లుగా ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిరోధకస్థాయి 1,914-1,930 డాలర్లు.

అస్థిరంగానే

అస్థిరంగానే

బులియన్ మార్కెట్లోను పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు, వ్యాక్సీన్ అంశాలను పక్కన పెడితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు బంగారం ధరలు అస్థిరంగా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. డాలర్ వ్యాల్యూ పెరిగితే పసిడి ధరలు తగ్గుతాయి. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 2,075 డాలర్లకు పైగా పెరిగింది. ఆ ధరలతో పోలిస్తే ఇప్పుడు 175 డాలర్ల వరకు తగ్గింది.

English summary

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు, అక్కడ మళ్లీ 1,900 డాలర్లకు.. | U.S Dollar Limits Gold Price Move Above $1,900

Gold and silver fell sharply in Indian markets, tracking softness in global rates. On MCX, December gold futures were down 0.8% to ₹50249 per 10 gram, their second fall in three days. Silver futures on MCX plunged 2.8% to ₹60700 per kg. In the previous session, gold had surged 1% or about ₹500 while silver had jumped ₹1,900 per kg.
Story first published: Wednesday, September 30, 2020, 22:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X