కరోనా మహమ్మారి నేపథ్యంలో గత మూడు నాలుగు నెలలుగా వాహనాల సేల్స్ భారీగా పడిపోయాయి. ఆటో పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే సెకండ్ హ్యాండ్ సేల్స్‌తో పాటు బైక్స్, స్కూటర్లు, చిన్న కార్లకు డిమాండ్ పెరిగింది. పెద్ద-ఖరీదైన కార్లకు, వాహనాలకు ఇంకా డిమాండ్ పుంజుకోలేదు. బైక్స్ అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయని బజాజ్ ఆటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) సోమెన్‌రె తెలిపారు.

పెరుగుతున్న సేల్స్
కరోనా వల్ల ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు లేకుండా పోయాయని, ఇప్పుడు కాస్త పుంజుకున్నాయని చెప్పారు. అయితే సేల్స్ గణనీయంగా పుంజుకున్నాయా లేక ప్రజా రవాణాలో వెళ్లేందుకు భయపడుతూ, సొంతగా ప్రయాణించేందుకు బైక్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారా అనే విషయం ఆగస్ట్ చివరి నాటికి తెలుస్తుందని చెప్పారు. ప్రధానంగా టూవీలర్ సేల్స్ మాత్రం పెరుగుతున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే, మే నెలతో పోలిస్తే జూన్, జూన్ నెలతో పోలిస్తే జూలైలో మరింత బాగుందన్నారు.

త్రీ-వీలర్ సేల్స్ పెరగలేదు.. ఎందుకంటే
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో కంపెనీ 1,85,981 యూనిట్ల వాహనాలు దేశీయంగా విక్రయించినట్లు తెలిపారు. 2019లో ఇదే కాలంలో 6,10,936 విక్రయించినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ 69.55 శాతం మేర తగ్గాయన్నారు. త్రీ-వీలర్ సేల్స్ అమ్మకాల రికవరీ ఇంకా పూర్తిగా అందుకోలేదన్నారు. ఇవి ఎక్కువగా లోన్లపై చేస్తుంటారని, వ్యాపారాలు లేని సమయంలో వీటికి నెలవారీ చెల్లింపులు ఎలా చేయాలనే భావంతో వెనుకాడుతున్నారని తెలిపారు.

ఇంటర్నేషనల్ మార్కెట్ భేష్
కంపెనీ త్రీ-వీలర్ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో 86,217 నుండి 93.87 శాతం తగ్గి 5,282కు తగ్గినట్లు తెలిపారు. తమకు 63 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉందని చెప్పారు. ఇంటర్నేషనల్ మార్కెట్లోను టూ వీలర్స్ డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో 4,71,691 యూనిట్లు విక్రయించగా ఈసారి 2,13,000 యూనిట్లు సేల్ అయ్యాయి. బజాజ్ ఆటోకు 48 శాతం వాటా ఉన్న కేటీఎం భారీగా పుంజుకుంటున్నట్లు తెలిపారు. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలలో పుంజుకుందన్నారు. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్ 33,267 యూనిట్ల సేల్స్‌తో పోలిస్తే ఈసారి 33,220గా నమోదయింది.


Click it and Unblock the Notifications