మన తల్లిదండ్రులు ఒకే జీతంతో 3BHK ఇల్లు కొనగలిగారు. కానీ నేడు చాలా మంది దంపతులు రెండు జీతాలు సంపాదించినా, మహానగరాల్లో ఒక ఫ్లాట్ కొనడం కలగానే మిగిలిపోతోంది. వెల్త్ అడ్వైజరీ ఫర్మ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ ముకుంద్ ప్రకారం, అసలు సమస్య ఆదాయంలో లేదు, గృహ సరఫరా విధానంలో ఉంది.

భారత్‌లో ఉద్యోగులు ఇంతకుముందు కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. రెండు జీతాలు కలిపి చూస్తే, కుటుంబానికి సౌకర్యవంతమైన జీవనం సాధ్యం అవుతుంది. అయితే ఇల్లు కొనడం మాత్రం ఇంకా ఆలస్యం అవుతుంది దానికి కారణం ఏమిటి? ముకుంద్ ప్రకారం, గృహ మార్కెట్‌లో డిమాండ్ చాలా ఎక్కువ. కానీ సరఫరా మాత్రం ప్రజల అవసరాలను తీరుస్తున్న విధంగా ఉండడం లేదు.
మహానగరాల్లో ఈ తేడా మరింత తీవ్రమైంది. అక్కడ జనాభా-ఇళ్ల సరఫరా నిష్పత్తి 10:1గా ఉంది. అంటే ప్రతి పది మందికి ఒక ఇల్లు మాత్రమే అందుబాటులో ఉందన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 3:1 లేదా 2:1. అందువల్ల అక్కడ ప్రజలకి ఇల్లు కొనడం సులభంగా సాగుతుంది.
మరికొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత నగరాల్లో ఇప్పటికే 1.1 కోట్ల ఖాళీ ఇళ్లు ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో ఇంకా 1.9 కోట్ల ఇళ్ల కొరత ఉందని అంచనా. ఈ పరిస్థితికి అసలు సమస్య ఎక్కడుందో స్పష్టంగా చూపిస్తుంది. "సమస్య కేవలం సరఫరాలో లేదు. ప్రజలకు అందుబాటులో ఉండే చవకైన, నివసించదగిన ఇళ్లు అందడం లేదు" అని ముకుంద్ వివరిస్తున్నారు.
గృహ నిర్మాణ రంగం ప్రధానంగా లాభాల కోసం నడుస్తుంది. ఇన్వెస్టర్లు డబ్బు, అధిక మార్జిన్లు కావాలనే ఆశతో ఎక్కువ మంది డెవలపర్లు కేవలం లగ్జరీ హౌసింగ్ నిర్మాణంపైనే దృష్టి పెడుతున్నారు. కానీ అసలు డిమాండ్ ఎక్కడుందంటే, మొదటిసారి ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి యువత, కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టిన దంపతుల వద్ద ఉంది. వారికి అవసరమైన 'స్టార్టర్ హోమ్స్' చాలా తక్కువగా నిర్మించబడుతున్నాయి. అందువల్ల ఇళ్లు మార్కెట్లో ఖాళీగా ఉన్నా, వాటిని కొనగలిగే సామర్థ్యం మధ్యతరగతికి ఉండడం లేదు.
కేవలం డిమాండ్-సరఫరా సమస్య మాత్రమే కాదు, మరిన్ని నిర్మాణాత్మక సమస్యలు కూడా ఈ గృహ సంక్షోభానికి కారణం.
భారత్‌లో గృహ మార్కెట్‌ని వక్రీకరించే కొన్ని కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా భూ రాజకీయాలు భూములపై వివాదాలు, అనుమతుల జాప్యం కొత్త ప్రాజెక్టులు ఆలస్యమవ్వడానికి దారి తీస్తున్నాయి. అదే సమయంలో, FSI పరిమితులు (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) ఒకే భూమిపై ఎక్కువ ఇళ్లు నిర్మించే అవకాశాన్ని తగ్గిస్తాయి. మరోవైపు, ఇన్వెస్టర్ ఊహాగానాలు కూడా పెద్ద సమస్య. చాలా మంది రియల్ ఎస్టేట్‌ని నిజంగా నివసించడానికి కాదు, లాభాల కోసం పెట్టుబడి సాధనంగా వాడుతున్నారు. దీనికి తోడు, నల్లధనం ప్రవాహం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. పారదర్శకత లేకపోవడంతో నల్లధనం రియల్ ఎస్టేట్‌లోకి రావడం, ఇళ్ల ధరలు ఎక్కువుగా పెరగడానికి కారణమవుతోంది. ఈ అన్ని కారణాల వలన నష్టపోతున్నది మాత్రం మధ్యతరగతి ప్రజలే.
సగటు జీతం తీసుకునే ఉద్యోగి ఇల్లు కొనాలని కలగంటాడు. హోమ్ లోన్ తీసుకుని, కష్టపడి చెల్లించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మార్కెట్‌లో లభ్యమయ్యే ఇళ్లు ఎక్కువగా లగ్జరీ సెగ్మెంట్‌లో ఉండటంతో, ఆ కల వాస్తవం కావడానికి చాలా దూరంలో ఉంటుంది. ముకుంద్ మాటల్లో, "ప్రతి ఒక్కరికీ ఈ మార్కెట్ లాభిస్తోందేమో కానీ సగటు జీతం తీసుకునే భారతీయుడు, తన కలల ఇల్లు కొనాలనుకునే వ్యక్తికి మాత్రమే అది మిగల్లేకపోతుంది.
భారత్‌లో గృహ మార్కెట్‌ను సమంగా చేయాలంటే కొన్ని పెద్ద మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా, అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించడం చాలా అవసరం. డెవలపర్లు ఎప్పటికప్పుడు లగ్జరీ ప్రాజెక్టుల పైనే దృష్టి పెట్టకుండా, మధ్యతరగతి కొనగలిగే చవకైన ఇళ్ల వైపు మళ్లాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా సబ్సిడీలు, పన్ను రాయితీలు, మధ్యతరగతి కోసం ప్రత్యేక గృహ పథకాల రూపకల్పన వంటివి ఇవ్వాలి. మరో ముఖ్య అంశం పారదర్శకత. రియల్ ఎస్టేట్‌లో నల్లధన ప్రవాహం తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. చివరగా, FSI సడలింపులు కూడా అవసరం. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న నగరాల్లో, ఒకే భూమిపై ఎక్కువ ఇళ్లు నిర్మించేందుకు వీలుగా నియమాలను సడలిస్తే సరఫరా పెరుగుతుంది. ఇవన్నీ కలిపి గృహ మార్కెట్‌ను కొంతవరకు సరిచేయగలవు.
రెండు జీతాలు సంపాదిస్తున్నప్పటికీ ఇల్లు కొనలేని పరిస్థితి మధ్యతరగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఖాళీ ఇళ్లు ఉన్నా, సరైన ధరలో, సరైన ప్రదేశంలో లభించకపోవడం అసలు సమస్య. ఈ గృహ మార్కెట్‌ను సరిచేయకపోతే, రాబోయే తరాలు తమ సొంత ఇల్లు కలను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

వైజాగ్ రియల్ ఎస్టేట్.. ఈ నాలుగు జోన్లలోని ఫ్లాట్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు..కారణం ఏంటంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications