కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ మధ్య వార్ నడుస్తోంది. కొన్ని ట్విట్టర్ ఖాతాలను తొలగించాలన్న ఆదేశాలపై ట్విట్టర్ వివరణపై ఐటీ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింక్స్ కలిగిన 1,178 ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో ట్విట్టర్ దాదాపు 500 ఖాతాలు తొలగించింది. అయితే ప్రభుత్వం ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలకు ముందు ఇది సరికాదని తెలిపింది.

అందుకే కేంద్రం ఆగ్రహం
పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రైతుల నిరసన నేపథ్యంలో ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తోన్న 257 మంది ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఆ ఖాతాలను నలిపివేసిన కొద్ది గంటలకు తిరిగి పునరుద్ధరించింది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఈ నెల 4న 1,178 ఖాతాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైతుల నిరసనపై తప్పుడు సమాచారం, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

500 ఖాతాల నిలిపివేత
కేంద్రం ఆదేశాలకు ట్విట్టర్ పాక్షికంగానే మద్దతు ఇచ్చింది. 1100కు పైగా ఖాతాలు నిలిపిపివేయాలని ఆదేశించగా, 500 ఖాతాలను మాత్రమే నియంత్రించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బ్లాగ్ పోస్టులో ట్విట్టర్ తెలిపింది. వార్తా సంస్థలు, జర్నలిస్ట్స్, కార్యకర్తలు, రాజకీయ నాయకుల ఖాతాలను నిలిపివేయలేదని వెల్లడించింది. ఈ ఖాతాలు నిలిపివేస్తే భావ వ్యక్తీకరణ హక్కును ఉల్లంఘించినట్లవుతుందన పేర్కొంది.

'కూ'లో ప్రభుత్వం స్పందన
ట్విట్టర్ తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాతాల నిలిపివేతపై చర్చించే అవకాశం కల్పించాలని ట్విట్టర్ కోరిందని, ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యేందుకు అంగీకరించారని, అంతలోపే ట్విట్టర్ బ్లాగ్ పోస్టులో తన వాదనను ప్రచురించడం సరికాదని కేంద్రం పేర్కొంది. మరో స్వదేశీ సామాజిక మాధ్యమం 'కూ'లో ప్రభుత్వం స్పందించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications