ముంబై: దేశంలో కొంతకాలంగా విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. టూవీలర్స్ సెగ్మెంట్‌లో మాత్రమే కాకుండా పర్సనలైజ్డ్ ఫోర్ వీలర్స్ కొనడానికి ముందుకొస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే కాలుష్యం వల్ల పర్యావరణానికి సంభవిస్తోన్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నారు.. ఆదరిస్తున్నారు ప్రజలు.
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తే.. వాటికి ఛార్జింగ్ ఎలా అనే సందేహాలు కొనుగోలుదారుల్లో నెలకొంటోన్నాయి. పెట్రోల్ బంకుల తరహాలో విస్తారంగా ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ పాయింట్లు గానీ, స్టేషన్లు గానీ అందుబాటులో లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ మోటార్స్, టాటా పవర్ ఓ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పబోతోన్నాయి.

విస్తృతంగా ఏర్పాటు చేయబోయే ఈ ఛార్జింగ్ పాయింట్ల కోసం అవసరమైన విద్యుత్‌ను సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. టీవీఎస్ మోటార్స్ నుంచి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ టూవీలర్‌ను కొనుగోలు చేసిన వారి కోసం టాటా పవర్ సహకారంతో టీవీఎస్ మోటార్స్ మేనేజ్‌మెంట్- ఈ ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పనుంది.
దేశవ్యాప్తంగా తొలిదశలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో టాటా పవర్ కంపెనీ యాజమాన్యం.. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ను నెలకొల్పుతుంది. టీవీఎస్ మోటార్స్ లొకేషన్స్‌లో ఇవి అందుబాటులోకి వస్తాయి. సౌర విద్యుత్ ఆధారంగా అవి పని చేస్తాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్ (ఏసీ), డైరెక్ట్ కరెంట్ (డీసీ) నెట్‌వర్క్‌ను టాటా పవర్ నెలకొల్పుతుంది. డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూవీలర్ ఛార్జింగ్ పాయింట్లు లేదా స్టేషన్లుగా ఇవి పని చేస్తాయి.
టీవీఎస్ మోటార్స్‌కు చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలుదారులతో పాటు ఇతర వాహనాల కోసం అవి అందుబాటులోకి వస్తాయి. తొలిదశలో ఈ ఛార్జింగ్ పాయింట్లు టీవీఎస్ లొకేషన్స్‌లో నెలకొల్పాలనే ప్రతిపాదన ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ ప్లాంట్‌లో గానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఆ కంపెనీ షోరూమ్‌లల్లో గానీ టాటా పవర్- ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ను నెలకొల్పుతుంది. ఈ దిశగా టీవీఎస్ మోటార్స్-టాటా పవర్ ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications