అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక చాలా కథ దాగి ఉంది. భారత్, రష్యా చమురు, డాలర్ ఆధిపత్యం మధ్యన ట్రంప్ ఆడుతున్న ఓ గ్లోబల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ట్రంప్ సుంకాల యుద్ధం అంతా డాలర్ ఆధిపత్యం తగ్గకుండా కాపాడుకోవడమేనని తెలుస్తోంది. భారత్‌పై ఇప్పటికే 25 శాతం అదనపు దిగుమతి సుంకాన్ని విధించిని ట్రంప్ నిన్న మళ్లీ 25 శాతం సుంకాలు విధించాడు. దీంతో దిగుమతులపై మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరుకుంది. రష్యా చమురును దిగుమతి చేసుకోవడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు.
అయితే ఇది నిజంగా చమురు కోసమేనా అంటే కానే కాదు..ఇది చాలా లోతైన గేమ్ అని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన ప్రకారం చూసుకున్నట్లయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు.. భారత్ చమురు కొనుగోళ్ల ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిని సమర్థించలేమని, అమెరికా జాతీయ భద్రతకు ఇది ముప్పుగా మారుతుందని ట్రంప్ చెబుతున్నారు.అయితే భారత ప్రభుత్వం దీనిపై ఘాటుగానే స్పందించింది. చమురు కొనుగోళ్లు మా దేశ ప్రయోజనాల ఆధారంగా ఉంటాయి, మార్కెట్ ధరలే ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఇది చమురు గేమ్ కాదు.. డాలర్ గేమ్: ట్రంప్ తీసుకున్న ఈ దాడికి అసలు మూలకారణం డాలర్ గవర్నెన్స్ అని ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలతో BRICS (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారు తమ కరెన్సీల్లో పరస్పర వాణిజ్యం ప్రారంభించడంతో అమెరికాల భయం పట్టుకుంది. ప్రపంచ మార్కెట్లో డాలర్ ఆధిపత్యం క్షీణించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది.
కాగా Trump గతంలోనే డాలర్ రిజర్వ్ కరెన్సీ స్టేటస్ పోతే.. అది యుద్ధంలో ఓడిపోవడమే అని చెప్పిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఇది ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న తీరుతో ప్రమాదంలో పడుతోందని ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయమే ఆయనలో భయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. 1944 నుంచి USD ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉంది. ప్రపంచంలో 90 శాతం అంతర్జాతీయ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతుండగా..తాజాగా BRICS దేశాలు తీసుకున్న చర్యలు ఈ ఆధిపత్యాన్ని బలహీనపరచబోతున్నాయి.
ట్రంప్ సుంకాలు విధించడం ఇది మొదటి సారి కాదు.. ఇప్పటికే బ్రెజిల్‌పై 50 శాతం టారిఫ్ విధించారు. అలాగే చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగించారు. ఇప్పుడు భారతదేశంపై కూడా అదే వ్యూహాన్ని అమలు చేశారు. అయితే భారత్‌ను టార్గెట్ చేయడం ద్వారా.. ఇతర BRICS దేశాలపై కూడా ఒత్తిడి తీసుకురావాలనేది ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆయనకే ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తున్నాయి. BRICS దేశాలు ఏవీ ట్రంప్ బెదిరింపులకు భయపడటం లేదు.
నీకు చేతనైంది చేసుకోమంటూ తమ పని తాము చేసుకుంటు వెళుతున్నాయి. తమ దేశ కరెన్సీతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక అగ్ర దేశాలు రష్యా, చైనా తమలో తాము తమ సొంత కరెన్సీలో వ్యాపారం చేసుకుంటున్నాయి. కాగా బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపై సుంకాల బెదిరింపులు ట్రంప్ చేశారు. ఈ దేశాలన్నీ డాలర్ మీద ఆధిపత్యాన్ని తగ్గించుకుంటున్నాయి.
US డాలర్, గత ఎనిమిది దశాబ్దాల నుండి అంటే 1944 నుండి US డాలర్ ఆధిపత్యం చెలాయించింది. నివేదికలను చూసుకున్నట్లయితే.. దాదాపు 90 శాతం విదేశీ మారక లావాదేవీలు డాలర్లలో మాత్రమే జరుగుతాయి. తాజాగా దానిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి BRICS దేశాలు తీసుకున్న చర్యలు ప్రపంచ రిజర్వ్ కరెన్సీని (డాలర్) ఇరకాటంలో పడేశాయి. ఇక BRICS కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ప్రపంచ GDPకి 35 శాతం కంటే ఎక్కువ దోహదం చేస్తుంది. ఈ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గిస్తే అది అమెరికాకు సంక్షోభానికి కారణం అవుతుంది.డాలర్ పట్ల ట్రంప్ కు ఉన్న భయమే ఆయనను నిరంతరం బ్రిక్స్ దేశాలను బెదిరిస్తూనే ఉంది. దీనికి భారత్ కూడా బలైంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ దేశాలలో ఏవీ ట్రంప్ బెదిరింపులకు తలొగ్గడానికి సిద్ధంగా లేవు.
More From GoodReturns

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications