నేను లేకుంటే పాక్ ప్రధాని ఎప్పుడో శవమైపోయేవాడు.. భారత్-పాక్ యుద్దంపై మరో బాంబు పేల్చిన ట్రంప్..

అమెరికా అధ్యక్ఫుడు డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన ఏం పని చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో భారత్-పాకిస్తాన్ యుధ్దం తానే ఆపానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. వీటిని భారత్ కూడా ఖండించింది.

ఆ వార్తలు అలా ఉండగానే సుంకాల భయంతో రెండు దేశాలు కాంప్రమైజ్ అయ్యాయంటూ మరో బాంబు పేల్చాడు. దీనిపై మోదీ సర్కారు కూడా తీవ్రంగా మండిపడింది. భారత ప్రభుత్వం ఎప్పటికీ యుద్ధ నిలిపివేతలో ఏ యూఎస్ మధ్యవర్తిత్వం జరిగినదన్నదాన్ని అంగీకరించలేదు. 2025లో యుద్ధశాంతి కి వచ్చిన నిర్ణయం ఆ రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య నేరుగా సంపన్నమైనదే అని స్పష్టం చేసింది.

అయితే తాజాగా మరోసారి భారత్-పాక్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు Trump.ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లోనే కాకుండా గ్లోబల్ బిజినెస్, ట్రేడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. బుధవారం నిర్వహించిన అత్యంత కీలక 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగంలో అమెరికా జోక్యం లేకపోతే పాకిస్థాన్ ప్రధాని బతికి ఉండేవారు కాదు అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Donald Trump Pakistan PM statement Trump Pakistan PM would have died Operation Sindoor Trump claim Trump India Pakistan ceasefire Trump trade deal diplomacy US trade pressure Pakistan India Trump viral comment Pakistan PM Trump nuclear war claim India Pakistan Trump tariffs peace claim US role India Pakistan tensions Trump foreign policy trade leverage Pakistan PM US involvement claim Trump State of the Union Pakistan Trump India Pakistan trade angle Operation Sindoor controversy

ఈ వ్యాఖ్యలను ఆయన భారత-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులు.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో అనుసంధానించారు. ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా అంతర్జాతీయ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని.. రెండు అణు దేశాల మధ్య పెను విపత్తును తాను నివారించానని పేర్కొన్నారు.

భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం కీలకంగా పనిచేసిందని, అదే సమయంలో వాణిజ్య ఒత్తిడి (Trade Pressure) కూడా రెండు దేశాలను వెనక్కి తగ్గేలా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అణు యుద్ధం ముప్పు దాకా వెళ్లిన పరిస్థితుల్లో ట్రేడ్ డీల్‌లు, టారిఫ్ హెచ్చరికలు శాంతికి మార్గం వేశాయని ట్రంప్ వాదిస్తున్నారు.

ఏప్రిల్ 22, 2025న పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత 2025లో మే నెలలో భారత్ - పాకిస్తాన్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఈ ఘర్షణలు 2025 మే 7 నుంచి మొదలయ్యాయి. ఈ యుద్ధం మొదలై ఉంటే పాక్ ప్రధానితో సహా దేశంలోని 35 కోట్ల మంది ప్రాణాలు కోల్పేయావారని ట్రంప్ అన్నారు.

అయితే వ్యాఖ్యల అంచనాకు గల ప్రాతిపదికను గానీ, ఆపరేషన్ సిందూర్ నేపధ్యాన్ని గానీ ట్రంప్ వెల్లడించలేదు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలని నేను ఆపానని ఆయన చెప్పడం గమనార్హం. ఇంకా ముందుకు వెళితే భారత్-పాక్ మధ్య తలెత్తిన అణు ముప్పును తప్పించడంలో తన పాత్ర నిర్ణాయకమని ఆయన అన్నారు.

ట్రంప్ తరచుగా తన విదేశాంగ ప్రకటనలలో టారిఫ్‌లు, ట్రేడ్ ఒత్తిడి వంటి ఆర్థిక ప్రభుత్వ చర్యలను కూడా శాంతిని సాధించడం లో కీలకంగా వర్ణించాడు. ట్రేడ్ ఒత్తడితో దేశాలను శాంతి దిశగా కదిలించవచ్చనే భావాన్ని అతను పునరావృతం చేశాడు. ఈ విధంగా, గ్లోబల్ ట్రేడింగ్ షిఫ్ట్‌లు, టారిఫ్ విధానాలు, ఆర్థిక ఒత్తిడులు ఇతర దేశాల రాజకీయాలు మరియు సైనిక నిర్ణయాలపై ప్రభావం చూపగలవని ట్రంప్ సందేశం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతి సందర్భంలోనూ అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమవుతాయి. స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు, చమురు ధరలు వెంటనే స్పందిస్తాయి. అటువంటి వేళ అమెరికా జోక్యం శాంతి దిశగా కదిలితే, దాని ప్రభావం గ్లోబల్ ఇన్వెస్టర్ల నమ్మకంపై పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా తన వాణిజ్య శక్తిని "శాంతి సాధనానికి" ఉపయోగించిందన్న వాదనగా బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు, పాకిస్థాన్ విషయంలో అమెరికా-పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలు, IMF సహాయం, ఎగుమతులు-దిగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలపై ట్రేడ్ ఒత్తిడి మరింత ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.

దీనిని భారత్ కోణంలో చూస్తే.. దేశం ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాతో పెరుగుతున్న ట్రేడ్ డీల్ చర్చలు, మాన్యుఫాక్చరింగ్, డిఫెన్స్ ఒప్పందాలు కూడా ఈ రాజకీయ పరిణామాలకు పరోక్షంగా అనుసంధానమై ఉన్నాయి. ఏదేమైనా ట్రంప్ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే, ట్రేడ్ డిప్లమసీ అనే అంశం గ్లోబల్ పాలిటిక్స్‌లో ఎంత కీలకంగా మారిందన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+