అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి వాణిజ్య యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ఉక్కు, అల్యూమినియంపై భారీ టారిఫ్‌లు విధించిన ట్రంప్ తాజాగా కాపర్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అలాగే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఔషధాలపై 200 శాతం టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ వాణిజ్య సుంకాలు (టారిఫ్‌లు) భారత్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.
ఇప్పటికే కొన్ని వారాలుగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా.. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత వ్యాపార రంగంలో ఆందోళన కలిగించాయి. అమెరికాలో మంగళవారం (జూలై 8) జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ సహా BRICS సభ్య దేశాలపై అదనపు 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.అలాగే ఇండియా ప్రధాన ఎగుమతి రంగమైన ఔషధాలపై (ఫార్మా) టారిఫ్‌ను 200 శాతం వరకు పెంచే అవకాశం ఉందని కూడా ట్రంప్ హెచ్చరించారు.

భారత ఫార్మా రంగానికి గట్టి దెబ్బ : భారత్ నుండి అమెరికాకు ఔషధాల ఎగుమతులు అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరం లో భారత్ అమెరికాకు దాదాపు 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేసింది. ఇది గత ఏడాదితో పోల్చితే 20% ఎక్కువగా ఉంది. అమెరికా.. భారత ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉంది.ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం, ఈ టారిఫ్ పెంపు తక్షణమే కాదు కానీ వచ్చే ఏడాదిలోపు 200 శాతానికి చేరుకునే అవకాశముందని తెలిపారు. Trump తాజా ప్రకటన ప్రకారం ఫార్మా, సెమీకండక్టర్ల దిగుమతులపై కొత్తగా టారిఫ్‌లు విధించనున్నారు. ఔషధాలపై సుంకాన్ని 200 శాతంకి పెంచే ముందు, కంపెనీలకు దాదాపు ఒక సంవత్సరం లేదా సంవత్సరన్నర గడువు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక మన దేశంలో ఫార్మా ఉత్పత్తులకు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు హబ్‌గా ఉన్నాయి.
కాపర్‌పై 50% టారిఫ్: టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్ వంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగించే కాపర్‌పై యుఎస్ 50 శాతం టారిఫ్ విధించనుంది. భారత్ 2024-25లో 2 బిలియన్ డాలర్లు విలువైన కాపర్‌ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 360 మిలియన్ డాలర్లు విలువైన కాపర్ అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసింది. ఇది మొత్తం ఎగుమతుల్లో సుమారు 17 శాతంగా ఉంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి వస్తే ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ కాపర్ టారిఫ్‌లు వచ్చే ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అమెరికా భారత్‌కు మూడవ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్ (సౌదీ అరేబియా, చైనా తర్వాత). కాపర్ టెక్నాలజీ, ఇంధనం, మానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడే ముడిసరుకు కావడంతో, అమెరికా డిమాండ్ తగ్గినా, భారత దేశీయ పరిశ్రమ ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనకపోవచ్చు.
BRICS దేశాలపై ట్రంప్ గురి : అమెరికాపై BRICS దేశాల ప్రభావాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాను దెబ్బతీయడానికి, డాలర్ విలువను తగ్గించడానికి ఏర్పడ్డ గ్రూప్ ఈ బ్రిక్స్ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. BRICS లో ప్రస్తుతం 11 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి..అవేంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా, ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE, ఇండోనేసియా. తాజాగా ఈ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
కుప్పకూలిన భారత ఫార్మా షేర్లు: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఫార్మాస్యూటికల్ కంపెనీల షేర్లు తీవ్ర క్షీణతను చూస్తున్నాయి. సన్ ఫార్మా లిమిటెడ్ స్టాక్ ప్రారంభ ట్రేడింగ్‌లో 2% వరకు పడిపోయి రూ.1649కి పడిపోయింది. దీనితో పాటు, లుపిన్ లిమిటెడ్ షేర్లు రెడ్ మార్క్‌తో ప్రారంభమయ్యాయి. సిప్లా లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అదే సమయంలో, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌తో సహా ఇతర ఫార్మా స్టాక్‌లు క్షీణతలో ఉన్నాయి. ఈ షేర్ల క్షీణతకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ కారణం. వేదాంత, హిందుస్తాన్ కాపర్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి రాగి మైనింగ్ కంపెనీల షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే పడిపోయాయి. ఉదయం 9:48 గంటలకు హిందుస్తాన్ కాపర్ షేరు 1.8 శాతం క్షీణించింది.
నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ లాభాలు నమోదు: ఇక జూలై 9 ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ లాభాలను నమోదు చేసింది. ఉదయం 9:25 గంటల సమయానికి ఇండెక్స్ 0.4 శాతం పెరిగి 22,252.50 వద్ద ట్రేడవుతోంది. లుపిన్ (Lupin),బయోకాన్ (Biocon),అరబిందో ఫార్మా (Aurobindo Pharma).,లారస్ ల్యాబ్స్ (Laurus Labs),ఈ షేర్లన్నీ ట్రేడింగ్ సమయంలో 1.5 శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్లకు మంచి రాబడి ఇచ్చాయి. ట్రంప్ తాజా టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో కూడా ఫార్మా స్టాక్స్‌లో కనిపించిన ఈ లాభాలు మార్కెట్ విశ్లేషకులను ఆకర్షించాయి.
పుంజుకున్న అమెరికా మార్కెట్: అమెరికా మార్కెట్ విషయానికి వస్తే..ట్రంప్ వ్యాఖ్యలతో US కామెక్స్ కాపర్ ఫ్యూచర్స్ ధరలు 12 శాతానికి పైగా పెరిగాయి. ఇది రికార్డు స్థాయిలో పెరుగుదలగా పేర్కొనబడింది. ఎందుకంటే ట్రంప్ చెప్పిన 50 శాతం టారిఫ్ రేటు విశ్లేషకుల అంచనాలను మించి ఉంది. మొత్తం మీద, ట్రంప్ నిర్ణయం కారణంగా భారతీయ షేర్లు పడిపోవడం, అమెరికాలో ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఏదేమైనా 200 శాతం టారిఫ్‌లు అమలైతే, భారత ఔషధ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అమెరికా ఆరోగ్య వ్యవస్థకు భారతీయ జనరిక్ ఔషధాల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ట్రంప్ నిర్ణయం ఫార్మా పరిశ్రమను గణనీయంగా దెబ్బతీయవచ్చు.ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నా.. ట్రంప్ వ్యాఖ్యలు ఆ ఒప్పందంలో పలు అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications