అగ్రరాజ్యం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో ఒప్పందం చేసుకోవచ్చునని, అయితే ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందా లేదా అని చెప్పలేనని, కానీ మరింత విస్తృతమైన ఒప్పందం కోసం ప్రస్తుతానికి దీనిని పక్కన పెడుతున్నామన్నారు. ఈ నెల 24న ఆయన భారత్ వస్తున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు.. అనుమానాలు
ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా వివిధ ఒప్పందాలపై జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలతో సందేహాలు కలుగుతున్నాయి. ట్రంప్ భారత పర్యటన బృందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్ కూడా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ధృవీకరించాల్సి ఉంది. రాబర్ట్ లైట్‌హైజర్ నేతృత్వంలోనే అమెరికా-భారత్ మధ్య చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆయన లేకుంటే ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నట్లే అంటున్నారు.

వీటికి ద్వారాలు తెరవండి..
భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ట్రంప్ తాజాగా మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసారు. వాణిజ్యం విషయంలో అమెరికాకు భారత్ సరైనప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఇరుదేశాలు కూడా వివిధ అంశాలపై ఒప్పందాలు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, టారిఫ్ విషయంలో అమెరికా మరిన్ని ఐటమ్స్‌ను జోడిస్తోంది. పిజ్జా చీజ్, వీప్రొటీన్ తదితరాలకు భారత్ ద్వారాలు తెరవాలని అమెరికా కోరుకుంటోంది.

నాటి నుండి ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు
గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. అప్పటి నుండి ఇరుదేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి మేజర్ డెవలప్‌మెంట్ లేదు. భారత్ - అమెరికా వాణిజ్య చర్చల్లో హార్లీ డేవిడ్సన్ బైక్స్ అంశం కూడా కీలకం కానుందని భావిస్తున్నారు.

టారిఫ్‌లో చిక్కుముడి
రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి ఒప్పందం కాకపోయినప్పటికీ పాక్షిక ఒప్పందం మొగ్గు చూపే అవకాశం ఉందని మరికొంతమంది భావిస్తున్నారు. ఇరుదేశాల మధ్య టారిఫ్‌లు కీలకమని, ఒప్పందం ఖరారులో ఇవే చిక్కుముడి అని చెబుతున్నారు.

అమెరికా అసహనం అందుకేనా?
స్టెంట్ వంటి మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌కు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని భారత్‌ను అమెరికా కోరుతోంది. అయితే ఇటీవల బడ్జెట్‌లో వైద్య పరికరాల దిగుమతి సుంకాన్ని భారత్ పెంచింది. దీనిపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్లుగా భావిస్తున్నారు. అలాగే, స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్ పెంచింది. దీనిపై ఇండియా అసహనంతో ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications