అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాల జారీలో ప్రస్తుతం ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిపాదన తీసుకు వచ్చింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ పెట్టింది. ఈ నోటిఫికేషన్ పైన 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(DHS) వెల్లడించింది.

లాటరీ స్థానంలో వేతనస్థాయి ఆధారితం
హెచ్ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతికి గుడ్‌బై చెప్పి, దీని స్థానంలో వేతనస్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అమెరికా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రతిపాదన ఉంది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులకు షాక్ అని చెప్పవచ్చు. ఉద్యోగాల్లో అమెరికన్లకే అధిక ప్రాధాన్యత అంటూ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నది ట్రంప్ సర్కార్. ఇప్పుడు లాటరీ పద్ధతికి బదులు గరిష్టవేతనస్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలు అందించేలా ఈ నిబంధన తీసుకు వస్తోంది.

భారత్‌తో పాటు పలు దేశాలకు షాక్
భారత్‌తో పాటు పలు దేశాల నుండి ప్రతి సంవత్సరం హెచ్1బీ వీసా కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి. వీటిలో కంప్యూటర్ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తారు. ఈ పద్దతిలో అమెరికాయేతర దేశాలకు చెందిన అభ్యర్ధులు తక్కువ వేతనానికి దొరుకుతుండటంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్1బీ వీసాను జారీ చేసేలా చర్యలు చేపట్టనుంది. లాటరీ పద్ధతిని రద్దుచేస్తూ ట్రంప్ పాలకవర్గం తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనకు అంగీకారం లభిస్తే అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ గరిష్టవేతనస్థాయి ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు.

ఎన్నికలకు ముందు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఎన్నికల్లో ఓటేసేందుకు లక్షల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా సిద్ధమయ్యారు. వీరిలో కొందరు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ముందస్తు ఓటు వేశారు. మరికొందరు వచ్చే నెల జరిగే పోలింగ్‌లో పాల్గొంటారు. వీరి సౌకర్యం కోసం అమెరికా ప్రభుత్వం, ఎన్నికల యంత్రాగం పలు చర్యలు తీసుకుంటోంది. అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్న ట్రంప్‌ను భారతీయులు సహా ఇతర దేశాల వారు ఏమేరకు సమర్థిస్తారనేది ఎన్నికల తర్వాత తెలియనుంది.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications